TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పీఎస్‌లో తన సిబ్బందిపై దాడి యత్నం.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం..!

Published on: Tue Sep 15, 2026 11:16AM

తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ స్టేషన్‌లో తన సిబ్బందిపై దాడికి యత్నించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. ప్రభుత్వ వ్యవస్థలు గూండాగిరికి అండగా నిలుస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలే దాడులకు, అరాచకానికి మద్దతుగా నిలిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో అరాచక త్వం పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల అసెంబ్లీ పరిసరాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.తాజా ఘటనను కూడా ఇదే రాజకీయ పరిణా మాల కొనసాగింపుగా పేర్కొంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి అను కూలంగా వ్యవహరిస్తోం దని ఆరోపించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామా లపై రాహుల్ గాంధీ స్పందించాలంటూ ప్రశ్నించారు.“వెల్ డన్ కాంగ్రెస్.. వెల్ డన్ రాహుల్ గాంధీ” అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న పరిణా మాలు ప్రజాస్వామ్యానికి, ప్రజల హక్కులకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన తన ట్వీట్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, బీఆర్‌ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ.. అసెంబ్లీ ప్రాంగణంలో అమలవుతున్న నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు.

 

 

 

[ KTR PA, Saifabad Police, Telangana Assembly Protest, KTR PRO, Hyderabad News, BRS Party News, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V.Anand, Telangana police ]