TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేటీఆర్ ఆస్తులివీ: సిరిసిల్ల వేదకగా బయటపెట్టిన సీఎం రేవంత్.!

Published on: Thu Oct 1, 2026 11:10AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి బీఆర్ఎస్ అగ్ర నాయకుల ఆస్తులపై ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. ఈ సారి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల వేదికగా గళమెత్తిన రేవంత్ రెడ్డి..కేటీఆర్ ఆస్తుల చిట్టా ఇదీ అంటూ సంచలన విషయాలు వెల్లడించారు.  గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు. దక్కన్ సెరాయ్ పేరుతో ఉన్న హోటల్స్, సుమారు నాలుగు వందలకు పైగా గదులు ఉన్న వివిధ ప్రాపర్టీలు కేటీఆర్ అధీనంలో ఉన్నాయని  రేవంత్ రెడ్డి చెప్పారు. కేవలం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకే పరిమితం కాకుండా విదేశాలలో కూడా కేటీఆర్ కుపెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. 

ఈ సందర్భంగా వివిధ నేతల అధీనంలో ఉన్న ఫామ్‌హౌస్‌లు,  వ్యవసాయ భూముల వివరాలను కూడా సీఎం ప్రస్తావించారు. జన్వాడలో కేటీఆర్, శంకర్ పల్లిలో కవిత, మొయినాబాద్‌లో హరీష్ రావు, ఎర్రవల్లిలో కేసీఆర్ కువ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి ఇంత భారీ మొత్తంలో ఆస్తులు, వందల కోట్ల విలువైన ఆస్తులు ఎలా సంపాదించారంటూ ఆయన కేటీఆర్‌ను సిరిసిల్ల బహిరంగ వేదికపై నుంచి నిలదీశారు. ఇటీవల కాలంలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన భూముల సర్వే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి  సిరిసిల్ల గడ్డపైనుంచే  కేటీఆర్ ఆస్తుల చిట్టాను   బయటపెట్టడం సంచలనం సృష్టించడమే కాకుండా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది.  

 

[KTR Assets, Sircilla Public Meeting, Revanth Reddy,Telangana Politics, KTR Property Details, Telugu One]