TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

2004లో కేసీఆర్‌కు ఒక్క ఎకరం భూమి లేదు.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులెలా వచ్చాయి..? : పొంగులేటి

Published on: Thu Sep 17, 2026 4:22PM

తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దూమారం రేపుతున్నాయి. కేసీఆర్ స్వయంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లను ప్రస్తావిస్తూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు.‘2004లో ఒక్క ఎకరం భూమి లేదని అఫిడవిట్‌లో చెప్పారు.. ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయి?’ అంటూ పొంగులేటి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ ఆస్తులు భారీగా పెరిగాయని ఆయన ఆరోపించారు. 

అయితే ఇదంతా కేవలం రాజకీయ ఆరోపణలేనా? లేక ఎన్నికల అఫిడవిట్‌లలో నమోదైన ఆస్తుల వివరాలే ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూముల విషయంలోనూ కేసీఆర్ కుటుంబంపై పొంగులేటి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు అప్పులు మిగిలితే.. కేసీఆర్ కుటుంబానికి భారీగా ఆస్తులు ఎలా సమకూరాయని ప్రశ్నించారు.ఇదే సమయంలో కేటీఆర్‌ను కూడా పొంగులేటి టార్గెట్ చేశారు. 

కేసీఆర్‌కు పుట్టుకతోనే వందల ఎకరాల భూమి ఉందని చెబుతున్న కేటీఆర్ వ్యాఖ్యలకు, ఎన్నికల అఫిడవిట్‌లలో నమోదైన వివరాలకు పొంతన ఉందా? అని ప్రశ్నించారు.అఫిడవిట్‌లో తప్పులు రాశారా? లేక ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా?’ అంటూ కేటీఆర్‌ను నిలదీశారు. కేసీఆర్ ఆస్తులపై గతంలోనూ రాజకీయ ఆరోపణలు వచ్చినప్పటికీ, ఈసారి ఎన్నికల అఫిడవిట్‌లను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు సంధించడం చర్చకు కారణమైంది. దీంతో 2004 నుంచి కేసీఆర్ సమర్పించిన వివిధ ఎన్నికల అఫిడవిట్‌లలో పేర్కొన్న భూములు, ఆస్తుల వివరాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

 

 

[ KTR, CM Revanth Reddy, KCR Farmhouse, BRS Party, Telangana Politics, KTR reacts to Revanth Reddy, KCR farmhouse assets, KTR press meet Telangana Bhavan, BRS vs Congress, KCR 67 acres land, Revanth Reddy challenge, Minister Ponguleti Srinivas Reddy,  TeluguOne News ]