అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు కోనేరు హంపి విజ్ఞప్తి.!
Published on: Fri Oct 9, 2026 8:21PM
.webp)
మంత్రి నారా లోకేష్‌తో భేటీ.. అకాడమీకి సహకరిస్తామని హామీ.!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం తన తండ్రి అశోక్‌తో కలిసి ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఆమె లోకేష్‌ను కలిశారు.ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్-2026 మహిళల విభాగంలో భారత జట్టు కాంస్య పతకం సాధించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విభాగంలో బోర్డు-1పై పోటీపడి కోనేరు హంపి కాంస్య పతకం సాధించడాన్ని అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత చెస్‌కు గుర్తింపు తీసుకురావడంలో ఆమె కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో చదరంగ క్రీడ అభివృద్ధికి అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని హంపి వివరించారు. ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ అందించడంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా వారిని తీర్చిదిద్దేందుకు అకాడమీ ఉపయోగపడుతుందని తెలిపారు. కోనేరు హంపి విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చదరంగ క్రీడను ప్రోత్సహించడంతో పాటు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
[ Konеру Humpy, Nara Lokesh, Amaravati Chess Academy, Andhra Pradesh News, Chess Olympiad 2026, Indian Chess Team, Chess Champion, Koneru Humpy Bronze Medal, AP Government, Chess Development, Amaravati News, Sports News Telugu, Andhra Pradesh Sports, Chess Training Academy, TeluguOne News ]


