TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేవంత్ ది తెలుగుదేశం రక్తం.. కొండా సంచలన వ్యాఖ్యలు.!

Published on: Fri Sep 4, 2026 10:51AM

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రేవంత్  మంత్రివర్గ ప్రక్షాళన వ్యవహారం.. కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్త్ రఫ్ తో కొత్త వివాదానికి తెరలేచింది.  తనకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన పరిణామాలపై కొండా సురేఖ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 

 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గతంగా నడుస్తున్న పరిణామాలు, నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు , రాష్ట్ర కాంగ్రెస్ లో పాత, కొత్త విభేదాలను మరోసారి తాజాగా కొండా సురేఖ తన వ్యాఖ్యల ద్వారా తెరపైకి తీసుకువచ్చారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి మూలాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని, ఆయనలొ  ప్రవహిస్తున్నది టీడీపీ రక్తమేనన్న కొండా సురేఖ..  కక్షసాధింపు రాజకీయాలు, వెన్నుపోటు కుట్రలు  తెలుగుదేం రక్తంలోనే ఉన్నాయన్నారు. 

తనను టార్గెట్ చేసే క్రమంలో చిన్నారెడ్డిని కూడా రాజకీయంగా బలి చేశారని కొండా సురేఖ ఆరోపంచారు. రక్షా బంధన్ సందర్భంగా తాను స్వయంగా సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టానని గుర్తు చేసిన కొండా సురేఖ ఆ సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి   ఈ వివాదం గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని చెబుతూ సెంటిమెంట్ పండించడానికి ప్రయత్నించారు. తనను కేబినెట్ నుంచి తప్పించే ఆలోచన  కాంగ్రెస్ అధిష్టానానికి లేదనీ, అయితే  కొందరు నేతలు స్వార్థ రాజకీయాల కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.  కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు అంతర్గతంగా ఏకమై తనపై పెద్ద కుట్ర పన్నారని  ఆరోపించారు. ముఖ్యమంత్రితో వేం నరేందర్ రెడ్డి మైండ్ గేమ్ ఆడిస్తూ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారన్నారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు గతంలో తాను రాసిన లేఖలను మీడియాకు విడుదల చేశారు.  పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు పంపిన ఆ లేఖల్లో ప్రభుత్వ తీరుపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని, తన శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా తన ప్రమేయం లేకుండానే మంత్రులు, అధికారులు చక్కబెట్టేశారని ఆ లేఖల్లో ఆరోపించారు.   


[Konda Surekha Sensational Comments, Revanth Reddy, Congress Government, Telangana Politics, TDP Blood Comments, Telugu One]