TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌కు ముందస్తు బెయిల్..!

Published on: Thu Sep 10, 2026 8:23PM

మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన న్యాయ స్థానం.. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.రూ.25 వేల చొప్పున రెండు వ్యక్తిగత పూచీ కత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ష్యూరి టీలను సమర్పించిన అనంతరం సుమంత్‌ను ముందస్తు బెయిల్‌పై విడుదల చేయాలని దర్యాప్తు అధికారికి సూచించింది. కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు వెంటనే ఆయన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రేరేపించడం, బెదిరించడం చేయరాదని షరతులు విధించింది. అదేవిధంగా కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని సుమంత్‌కు స్పష్టం చేసింది. పిటిషనర్లు తమ మొబైల్‌ నంబర్లు, నివాస చిరునామాలను దర్యాప్తు అధికారికి అందించాలని ఆదేశిం చింది. కోర్టు విధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంటూ ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది....

 

 

 

[ Konda Surekha OSD Sumanth gets anticipatory bail, OSD Sumanth, Konda Surekha,  CM Revanth reddy, Telangana goverment, KCR, KTR, BRS Party, Telugu One, Telugu News ]