ఖర్గేతో కొండా భేటీ.. ఏం జరిగిందంటే?
Published on: Mon Aug 24, 2026 9:17AM

తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ పార్టీ అదిష్ఠానం వద్దకు చేరింది. మంత్రి మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో బెంగళూరులో ఆదివారం (ఆగస్టు 23) భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి రావడానికి ఒక్కరోజు ముందు ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్టీలో సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆమె నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఖర్గేతో దాదాపు పావుగంట పాటు భేటీ అయిన సురేఖ్.. తాను సీఎం రేవంత్ రెడ్డికి కానీ, ఆయన కుటుంబానికి కానీ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని కొండా సురేఖ ఈ సందర్భంగా ఖర్గేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలోని కొందరు లక్ష్యంగా చేసుకుని, మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని, దీనిపై విచారణ చేపట్టాలని ఆమె కోరినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ.. పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని సురేఖకు హితవు చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఏఐసీసీ ఎన్నికల కమిటీ పరిధిలోని అంశమని, వాటిపై ఏకపక్ష ప్రకటనలుచేడయం తగదని ఖర్గే కొండ సురేఖకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కొండా సురేఖ కుమార్తె సుస్మిత.. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల టికెట్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సురేఖ, ఆమె కుమార్తెపై కఠిన చర్యలు తీసుకోవాలని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె నేరుగా ఖర్గేతో భేటీ అయ్యారని అంటున్నారు.
Konda Surekha meet Kharge, Bengalore, AICC President, Telangana, Congress, Panchayat


