ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా జి. చిన్నారెడ్డి తొలిగింపు..!
Published on: Thu Sep 3, 2026 3:02PM

తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించారు. పార్టీ వ్యవహారాల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిన్నా రెడ్డిపై కూడా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో కీలక నిర్ణయంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియామకానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మహిళా కమిషన్‌కు కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అలాగే కాక తీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణిని నియమించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో ఒకేసారి రాష్ట్రంలోని కీలక నామినే టెడ్ పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణి ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది
కొండా సురేఖ వ్యవహారంపై గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు చర్చలు జరిపారు. సురేఖపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు సురేఖ కూడా అధిష్ఠానా న్ని కలిసి తన వివరణ ఇచ్చారు.
తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆమె వ్యాఖ్యానించడం రాజకీయంగా మరింత దుమారం రేపింది... ఈ పరిణామాల నేపథ్యం లో సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించాలని నిర్ణయించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపో యాయి. అదే సమయంలో ప్రణాళికా బోర్డు, మహిళా కమిషన్, కుడా వంటి కీలక సంస్థలకు కొత్త నాయకత్వాన్ని ప్రకటించ డం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
(Konda Surekha Bartaraf, CM Revanth Reddy, Telangana Cabinet, Telangana Politics, Revanths Sensational Decision, Nerella Sarada, gundu sudharani, Telangana One, Telugu news )


