కొండా సురేఖ మాజీ ఓఎస్డీతో పాటు మరో ముగ్గురికి కోర్టులో ఊరట..!
Published on: Wed Sep 9, 2026 9:39PM

మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌తో పాటు మరో ముగ్గురికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరిపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయ స్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.కోర్టు ఆదేశాల ప్రకారం నలుగురూ ఒక్కొక్కరు రూ.25 వేల పూచీకత్తు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం పోలీసుల ఎదుట సరెండర్ కావాలని న్యాయస్థానం సూచించింది. ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి ఘటనకు సంబం ధించి సుమంత్‌పై పోలీ సులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇనుప రాడ్లతో దాడి చేశారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
సుమంత్ డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన విషయం విదితమే...అయితే ఈ కేసులో పరారీలో ఉన్న సుమంత్ తో పాటు ఇతర నిందితుల కోసం చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ నిందితులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేయ డంతో వారికి తాత్కాలిక ఊరట లభించింది. మరోవైపు, సుమంత్‌కు ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలపై తెలంగాణ హైకోర్టులోనూ విచారణ జరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 1న హైకోర్టు ఆయనకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరిం చింది తాజా కోర్టు ఆదేశాల తో కేసు దర్యాప్తు తదుపరి దశకు చేరుకోనుంది. నిందితులు పోలీసుల ఎదుట సరెండర్ కావడం, అనంతరం దర్యాప్తు అధికారులు చేపట్టే చర్యలు కీలకంగా మారనున్నాయి.
(Konda Surekha, Former OSD Sumanth, Telangana High Court, CM Revanth reddy, Telugu One, Telugu News)


