TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బుల్లెట్ బండెక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. మునుగోడులో వీధుల్లో పర్యటన.!

Published on: Tue Sep 29, 2026 1:04PM

మునుగోడు నియోజకవర్గంలో మౌలిక వసతులు,  స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో  తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కారు వదిలేసి ద్విచ్రవాహనంపై మునుగోడు వీధుల్లో  ఆయన మంగళవారం (సెప్టెంబర్ 29) విస్తృతంగా పర్యటించారు.  హంగు ఆర్భాటాలకు తావులేకుండా సాధారణ పౌరుడిగా బైక్‌పై తిరిగిన ఆయననియోజకవర్గ కేంద్రంలోని పలు ప్రాంతాల పర్యటించి, ప్రజలతో మమేకమై వారి సమస్యల పై ఆరా తీశారు. 

 మునుగోడు   రోడ్ల దుస్థితి, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ లోపాలు,   ఇతర మౌలిక సదుపాయాల కొరతను   పరిశీలించారు. బైక్ పై వెళ్లడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు స్పష్టంగా తెలిశాయని ఈ సందర్భంగా కోమటిరెడ్డి తెలిపారు.  స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ఆయన అధికారులకు తెలియజేసి,  వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.  రోడ్ల మరమ్మతులు, మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడంపై సంబంధిత శాఖల అధికారులతో  మాట్లాడారు. 

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్న కోమటిరెడ్డి.. ఏ చిన్న సమస్య ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా అధికారులు వెంటనే స్పందించాలని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని చెప్పారు. 


గతంలో నియోజకవర్గ అభివృద్ధిపై అనేక హామీలు ఇచ్చిన నేపథ్యంలో, వాటి అమలు తీరును పరిశీలించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ ఆకస్మిక పర్యటన చేసినట్లు ఆయన తెలిపారు.  


[Komatireddy Rajagopal Reddy, Munugode, Bike Tour, Civic Issues, Infrastructure, Telugu One]