చిరు బర్త్ డే వేడుకల్లో కొడాలి నాని.. ఏం జరుగుతోంది?
Published on: Mon Aug 24, 2026 10:39AM
.webp)
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గుడివాడలో మాత్రం చిరంజీవి బర్త్ డే వేడుకలు ఒకింత ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఇందుకు కారణంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, గతంలో జనసేన అధినేత, చిరంజీవి సోదరుడు అయిన పవన్ కల్యాణ్ పై ఇష్ఠారీతిగా నోరు పారేసుకున్న కొడాలి నాని గుడివాడలో జరిగిన చిరు బర్త్ డే వేడుకల్లో స్వయంగా పాల్గొని కేక్ కట్ చేశారు. గుడివాడ చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు, వైసీపీ శ్రేణులూ కలిసి ఈ కర్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి.. ఎంతోమంది యువ నటులకు మార్గదర్శకుడిగా, స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
ఐదేళ్ల పాటు అంటే వైసీపీ అధికారంలో ఉన్న 2019, 2024 మధ్య కాలంలో ఇదే కొడాలి నాని.. పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. అటువంటి కొడాలి నాని గత కొంత కాలంగా తన నోటిని అదుపులో పెట్టుకుని తాను మారాను అన్న సంకేతాలు ఇవ్వడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం తరువాత కొడాలి నాని.. తన నోటి దురుసుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
అయినప్పటికీ ఆయనపై ఉన్న బూతుల నాని ముద్ర ఇసుమంతైనా తగ్గలేదు. ఇప్పుడు హఠాత్తుగా పవన్ సోదరుడు, మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, తాను మారిపోయానని, మెగా అభిమానులను నమ్మించడానికి ప్రయత్నాలు చేశారు. చిరంజీవి పట్ల ఆయనలో అకస్మాత్తుగా కలిగిన ఈ ఆదరణకు ఇదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే చిరు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని ఫొటోను జత చేస్తూ నెటిజనులు.. జగన్ హయాంలో పవన్ కళ్యాణ్ పట్ల నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నెట్టింట పోస్టు చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాపం తాను మారానని చెప్పుకోవడానికి నాని చేసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదని పరిశీలకులు అంటున్నారు.
Kodali Nani in Chiranjeevi Birthday celebrations, Megastar Birthday Celebrations Gudivada, Megafans, TeluguOne, Ap Politics


