ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో అపశ్రుతి: వాహనం కింద పడి యువకుడు దుర్మరణం.!
Published on: Fri Sep 25, 2026 12:03PM
.webp)
గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగుతుండగా ప్రమాదవశాత్తూ వాహనం కింద పడి ఓ యువకుడు మరణించాడు. శుక్రవారం (సెప్టెంబర్ 25) ఉదయం ఖైరతాబాద్ జంక్షన్ పరిసర ప్రాంతంలో మహాగణపతి శోభాయాత్ర సాగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఊరేగింపులో భాగంగా భారీ విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాన్స్‌పోర్టర్ వాహనం సమీపంలో ఓ ఇరవై ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు వాహనం కింద పడిపోయాడు. అక్కడున్న వారు గమనించి, స్పందిం చేలోపే ఆ యువకుడి పైనుంచి వాహనం దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
[Khairatabad tragedy, Ganesh immersion accident, Hyderabad procession, Khairatabad Ganesh procession, 20yearold youth die, Telugu One]


