TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర షురూ.!

Published on: Fri Sep 25, 2026 11:40AM

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది.   పది రోజుల వినాయక చవితి ఉత్సవాలు ఇప్పుడు చరమగట్టానికి చేరుకున్నాయి. భక్తుల కోలాహలం, జయజయధ్వానాల మధ్య మహా గణేషుని ఊరేగింపు సాగర్ వైపుగా సాగుతోంది. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని కనులారా వీక్షిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. 

ఈ ఏడాది ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన 69 అడుగుల భారీ  పంచముఖ సంకటహర మహా గణపతి' విగ్రహాన్ని గురువారం (సెప్టెంబర్ 24) రాత్రి వరకు సాగిన ప్రత్యేక దర్శనాల అనంతరం శుక్రవరం(సెప్టెంబర్ 25) భారీ  వాహనంపైకి భద్రంగా చేర్చారు.

అయితే..  చివరి నిమిషంలో చేపట్టవలసిన కొన్ని సాంకేతిక వెల్డింగ్ పనులు, తదితర ముగింపు ఏర్పాట్ల కారణంగా ఉదయం యాత్ర ఆరంభం కావడంలో ఒకింత జాప్యం జరిగింది. అయితే ముందుగా నిర్ణయంచిన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుని నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా పూర్తవుతుందని అధికారులు, నిర్వాహకులు చెబుతున్నారు.  

ఖైరతాబాద్ ప్రధాన పూజా మండపం నుంచి  బయలుదేరిన ఈ శోభాయాత్ర  రాజీవ్ గాంధీ విగ్రహం, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మీనార్, తెలుగు తల్లి జంక్షన్ , సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ ప్రాంతానికి  చేరుకోనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగర పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను, ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించి యాత్ర సాఫీగా సాగేలా అణువణువునా పర్యవేక్షిస్తున్నారు. 


[Khairatabad Maha Ganapati, Ganesh procession, Hussain Sagar immersion, Hyderabad Vinayaka festivities, Panchamukha Sankatahara Maha Ganapati, Telugu One]