సీఈసీ జ్ణానేశ్ కుమార్ పై విజిలెన్స్ విచారణ: కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్.!
Published on: Wed Nov 4, 2026 1:59PM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై విజిలెన్స్ విచారణకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జ్ణానేశ్ కుమార్ పై గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేరళ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చంది. ఆయన పీడబ్ల్యూడీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో 2 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరోను కేరళ సర్కార్ ఆదేశించింది.
కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఈ వివాదం తలెత్తింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన పాథిబెల్ సంస్థతో కలిసి పనిచేసిన ఇంజనీర్ లీ సీ బిన్‌కు రావాల్సిన చెక్కులు, పెండింగ్ బిల్లులను విడుదల చేసేందుకు జ్ఞానేశ్ కుమార్ లంచం కోరారని కాంట్రాక్టర్ వీ.ఓ. సాజన్ గతంలో ఆరోపించారు. పనులన్నీ పూర్తయి ఇంజనీర్లచే ఆమోదం పొందిన సుమారు 17 కోట్ల రూపాయల విలువైన బిల్లులను చెల్లించకుండా నిలిపివేసి, వాటి క్లియరెన్స్ కు లంచం డిమాండ్ చేశారన్నది జ్ణానేశ్ కుమార్ పై ఆరోపణ. ఈ మేరకు ఈ మేరకు కాంట్రాక్టర్ వీ.ఓ. సాజన్ ఫిర్యాదు చేశారు.
.webp)
అధికారులు బిల్లులు విడుదల చేయకపోవడం, నిరంతరం ఇబ్బందులకు గురిచేయడంతో ఇంజనీర్ లీ సీ బిన్‌కు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారని సాజన్ వెల్లడించారు. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆయన మలేసియాలో ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరణించే ముందు ఆయన రాసిన సుసైడ్ నోట్లో కూడా పీడబ్ల్యూడీ అధికారుల వేధింపుల ప్రస్తావన ఉందని కుటుంబ సభ్యులు కూడా అప్పట్లో తెలిపారు. లీసీబిన్ సుసైడ్, లంచం ఆరోపణలపై జరిగిన విజిలెన్స్ విచారణ నిష్పాక్షపక్షంగా జరగలేదని, క్లీన్చిట్ ఇచ్చే ఉద్దేశంతోనే దర్యాప్తును ముగించారని సాజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రస్తుతం జ్ఞానేశ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ పదవిలో ఉన్నారు. ఆయన గతంలో సివిల్ సర్వీస్ లో ఉన్న కాలంలో జరిగిన ఘటనలపై విచారణ చేపట్టడానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం కూడా ఇలాంటి కేసుల్లో విచారణకు వెసులుబాటు ఉందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి లభించే రక్షణలు గతంలో వారు చేసిన అధికారిక విధులకు సంబంధించిన అవినీతి ఆరోపణల విచారణను నిరోధించలేవని ఈ ఉదంతంతో మరోసారి నిరూపితమైంది.
తాజా పరిణామాల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో చట్టపరమైన నిబంధనల ప్రకారం ప్రాథమిక వేగవంతం చేసేందుకు సమాయత్తమౌతోది. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం లేదా సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
[Kerala Vigilance Probe On CEC Gyanesh Kumar, Bribery Allegations, Kerala Government, Green Signal, Telugu


