పడకగది రహస్యాలు చెప్పిన హీరోయిన్

 

హాలీవుడ్ హీరోయిన్ కెన్డ్రా విల్కిసన్ తెరమీద కనిపించినప్పుడు తన అందాలతో ఎంత సంచలనం సృష్టిస్తుందో, బోల్డ్‌గా మాట్లాడినప్పుడు కూడా అంతే సంచలనం రేపుతూ వుంటుంది. ఆమధ్య ప్లేబోయ్ పత్రిక కవర్ పేజీ మీద యమా హాట్‌గా పోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన పడగ్గది కబుర్లను ఎంతమాత్రం దాచుకోకుండా పబ్లిగ్గా, ఓ టీవీ ప్రోగ్రామ్‌లో చెప్పేసి అంతే కలకలం రేపింది. విల్కిసన్ ఈమధ్య హ్యూజ్ హెఫ్నర్ అనే తన బాయ్ ఫ్రెండ్‌తో పడగ్గదిలో ఎలా గడిపిందో, ఏమేం చేసిందో ఆమె ఎంతమాత్రం సిగ్గుపడకుండా చెబుతుంటే, వింటున్నవాళ్ళు మాత్రం సిగ్గుతో మొగ్గలై ముడుచుకుపోయారట. తాను పడగ్గదిలో ఉన్నప్పుడు భారీ స్థాయిలో విస్కీ గట్రా తాగుతుందట. సిగరెట్లు కూడా తాగుతుందట. అప్పుడే ఆమె పడగ్గదిలో చురుగ్గా వుంటుందట. కొంతమంది తనను బాగా మెప్పిస్తారట. కొంతమందితో శృంగారం ఏదో డ్యూటీ చేసినట్టుగా ముగిసిపోతుందట. ఇలా తన పడగ్గది కబుర్లు ఇంకా బోలెడన్ని చెప్పింది. అవన్నీ ఇక్కడ చెబితే పిల్లలు పాడైపోతారు. అన్నట్టు ఈ సుందరాంగి వయసు ఇప్పుడు 29 సంవత్సరాలు. ఈమెకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 78 సంవత్సరాల వయసున్న ఓ పెద్దమనిషిని పెళ్ళి చేసుకుని కొంతకాలం సంసారం చేసిన చరిత్ర కూడా ఈమెకి వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu