Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సిట్ విచారణ సందర్బంగా కేసీఆర్ భావోద్వేగం
posted on: Feb 1, 2026 3:22PM

సిట్ విచారణ సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గురైట్టు సమాచారం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసా. తెలంగాణ ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. స్వరాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. ఎంతో మందితో చర్చలు జరిపా..ఈ గదిలోనే రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేశా..ఇప్పుడు ఇదే గదిలో విచారణ ఎదుర్కోవటం దురదృష్టకరం అన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు మహిళా కార్యకర్తలకు మధ్య వాగ్వదం చోటుచేసుకుంది. మరోవైపు బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళనతో హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది.
నల్ల జెండాలతో మంత్రుల క్వార్టర్స్‌ను ముట్టడించిన బీఆర్‌ఎస్వీ విద్యార్థి విభాగం నేతలు.. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నిరసనకు దిగారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలును అదుపులోకి తీసుకున్నారు. మినిస్టర్ క్వార్టర్స్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ అధినేత సిట్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పలు చోట్ల బీఆర్‌ఎస్ నేతలు నిరసన చేపట్టారు.






