బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలి: కల్వకుంట్ల కవిత డిమాండ్.. కారణమేంటో తెలుసా.?
Published on: Wed Sep 30, 2026 12:44PM

బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత బయటకు రాక తప్పని పరిస్థితులు ఏర్పడడానికి ఆమె పార్టీలో కొనసాగుతున్న సమయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, సంతోష్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ఒక ప్రధాన కారణం. హరీష్ లక్ష్యంగా అప్పట్లో ఆమె చేసిన విమర్శలు, ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీంతో పార్టీ ఆమె క్రమశిక్షణ గీత దాటారని పేర్కొంటూ చర్య తీసుకుంది,
ఇప్పుడు ఆమె నాడు తనపై చర్య తీసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఎందుకు సస్పెండ్ చేయరంటూ నిలదీస్తున్నారు. సొంత సోదరుడు లక్ష్యంగా ఇప్పుడామె విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. నాడు హరీష్ రావుపై విమర్శలు చేశానంటూ తనపై క్రమశిక్షణ చర్య తీసుకున్న పార్టీ ఇప్పుడు అంత కంటే పెద్దతప్పు చేసిన కేటీఆర్ ను ఎలా, ఎందుకు ఉపేక్షిస్తోందంటూ నిలదీస్తున్నారు.
ఇటీవల ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
.webp)
అలా ఎమ్మెల్యేలకే నియోజకవర్గాలపై సంపూర్ణ అధికారాలను కట్టబెట్టడం వల్ల కింది స్థాయి నాయకత్వం, క్యాడర్ కేసీఆర్ కు దూరమైందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తప్పు చేశారంటూ కేటీఆఱ్ చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు హరీష్ రావుపై విమర్శలు చేసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేసిన కవిత.. మరి ఇప్పుడు కేటీఆర్ ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ పైనే విమర్శలు చేసినా ఎందుకు ఉపేక్షిస్తున్నారని నిలదీశారు.
[Kavitha, KTR, BRS, KCR, Harish Rao, Suspend KTR, Kavitha Demand, Telugu One]


