TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కారుమూరి కుటుంబానికి మరో షాక్.. లిక్కర్ కేసులో ఊహించని ట్విస్ట్.!

Published on: Tue Nov 3, 2026 5:52PM

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు  కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సునీల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ముఖ్యంగా సునీల్ రెండోసారి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ కూడా డిస్మిస్ కావడంతో కారుమూరి కుటుంబానికి కోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.

ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) పరిధిలో మద్యం డిపోల నుంచి రిటైల్ దుకాణాలకు మద్యం తరలించే రవాణా కాంట్రాక్టుల టెండర్ నిబంధనలను కొందరు వ్యక్తులకు అనుకూలంగా మార్చినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించినట్లు వెల్లడించింది.ఈడీ దర్యాప్తు ప్రకారం సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అనంతరం ప్రసాద్ ట్రాన్స్‌ పోర్ట్స్‌కు అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.  రవాణా కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీల వెనుక ఇతర వ్యక్తుల నియంత్రణ ఉందని ఈడీ పేర్కొంది. మద్యం రవాణా ఖర్చులను మార్కెట్ ధరల కంటే అధికంగా నిర్ణయించి అక్రమంగా లాభాలు పొందినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ వ్యవహా రంలో షెల్ కంపెనీలు, సబ్ కాంట్రాక్టులు, ఆర్థిక లావాదేవీల ద్వారా డబ్బు మళ్లించిన అంశాలపై ఈడీ విచారణ చేపట్టింది.

కారుమూరి ఇంట్లో సోదాలు.. ఖరీదైన వాచీలు స్వాధీనం.!

ఈ కేసులో భాగంగా 2026 జూన్ 11న హైదరా బాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కారుమూరి నాగేశ్వర రావు, ఆయన కుమా రుడు సునీల్‌కు సంబం ధించిన నివాసాలతో పాటు ఇతర నిందితుల ప్రాంగణాల్లోనూ తనిఖీలు చేపట్టారు.ఈ సోదాల్లో సుమారు రూ.94.5 లక్షల విలువైన ఖరీదైన వాచీలు, నగదు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పద జాయింట్ వెంచర్ ఒప్పందాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది.

ముందుగా కుమారుడు.. ఆ తర్వాత తండ్రి అరెస్ట్.!

ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్‌ను 2026 జూన్ 18న ఈడీ అధికా రులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా న్యాయ స్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.ఆ తర్వాత 2026 ఆగస్టు 23న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 24న నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో ఆయనను కూడా చంచల్‌గూడ జైలుకు తరలించారు.

బెయిల్ విషయంలోనూ నిరాశే.!

తాజాగా అందిన కోర్టు సమాచారం ప్రకారం కారుమూరి నాగేశ్వర రావు, ఆయన కుమా రుడు సునీల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సఇప్పటికే సునీల్ ఒకసారి బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమవగా, ఇప్పుడు తాజాగా రెండోసారి కూడా ఉపశమనం లభించ లేదు.దీంతో తండ్రీకొడు కులిద్దరూ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఏపీ మద్యం రవాణా కాంట్రా క్టుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈడీ దర్యాప్తు, నాంపల్లి కోర్టు తాజా నిర్ణయాలతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

 

 

[ Karumuri Venkata Nageswara Rao, Karumuri Sunil, AP Liquor Scam, AP Liquor Transport Scam, Liquor Transport Contracts, ED Investigation, Enforcement Directorate, Nampally Special Court, Bail Petition Rejected, Chanchalguda Jail, APSBCL Scam, Money Laundering, Andhra Pradesh Politics, YSRCP, AP CID, ₹195.33 Crore Scam, Liquor Tender Irregularities ]