TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహాచండీ రూపంలో బెజవాడ కనకదుర్గమ్మ: అమ్మవారి దర్శనానికి రాష్ట్రపతి ముర్ము రాక.!

Published on: Wed Oct 14, 2026 10:55AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో సాగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన బుధవారం (అక్టోబర్ 14) కనకదుర్గమ్మభక్తులకు  శ్రీ మహాచండి దేవి  రూపంలో దర్శనమిస్తున్నారు. త్రిశక్తి స్వరూపిణిగా ప్రసిద్ధి చెందిన ఈ మహాచండి అమ్మవారిని దర్శించుకునేందుకు దేశ ప్రథమ పౌరురాలైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము   ఇంద్రకీలాద్రికి రానున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

మహాచండి దేవిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండి మనీ  అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులకు శీఘ్ర దర్శనం లభించేలా ఏర్పాట్లు చేశారు. 

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ పర్యటన నేపథ్యంలో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు,  ఘాట్ రోడ్డు మార్గంలో పోలీసులు  భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలతో కూడిన పటిష్ఠ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం వీఐపీ దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు, సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. 

[Kanaka Durga Temple Sarannavaratri, Indrakeeladri Dussehra, Durgamma Maha Chandi Alankaram, Droupadi Murmu Vijayawada, Sri Durga Malleswara Swamy Temple, Telugu One]