అశ్లీల వీడియోలు ఇవ్వలేదని కడతేర్చారు.. కాకినాడ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..!
Published on: Sun Sep 13, 2026 1:46PM
.webp)
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిన సంచలనాత్మక గండి గిరిధర్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ నెల 2వ తేదీన కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాంబమూర్తినగర్‌లో 30 ఏళ్ల గండి గిరిధర్ తన ఇంట్లోనే విగతజీవుడిగా పడిఉన్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి జిల్లా అదనపు ఎస్పీ, ఇన్‌చార్జి డీఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ ఆదివారం మీడియా సమావేశంలో కీలక వివరాలను వెల్లడించారు. మృతుడి తల్లి గండి జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఎస్పీ జి. బిందు మాధవ్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు ఇతర క్లూస్‌ను విశ్లేషించిన పోలీసులు, ఈ నెల 12వ తేదీన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు అయిన నిందితులను సాంబమూర్తినగర్‌కు చెందిన పాలేపు వివేక్ అలియాస్ బన్నీ (18), అయోధ్య నగర్‌కు చెందిన ఏలూరి రామకృష్ణ (21)గా గుర్తించారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, మృతుడు గండి గిరిధర్‌కు గతంలో వివాహమై భార్యతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ప్రస్తుతం తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు.
ఈ క్రమంలో గిరిధర్ తనకు పరిచయం ఉన్న కొందరి మహిళలకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలను తన సెల్‌ఫోన్‌లో భద్రపరుచుకున్నట్లు పోలీసులు తేల్చారు. గిరిధర్‌తో సన్నిహితంగా తిరిగే నిందితులు వివేక్, రామకృష్ణలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో గిరిధర్ వద్ద ఉన్న ఆ ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను తీసుకుని, వాటి ఆధారంగా ఆ మహిళల కుటుంబ సభ్యులను బ్లాక్‌మెయిల్ చేసి సులభంగా డబ్బు సంపాదించవచ్చనే పక్కా పథకంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.
ఈ నెల 1వ తేదీ రాత్రి సమయంలో గిరిధర్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడని గుర్తించిన నిందితులు, అదే రోజు రాత్రి దాదాపు 12:15 గంటల ప్రాంతంలో అతని ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ వీడియోలు, ఫొటోల విషయమై గిరిధర్‌తో నిందితులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎంత చెప్పినా అతను ఆ అశ్లీల వీడియోలను ఇవ్వడానికి నిరాకరించడంతో, ముందస్తుగా తమ వెంట తెచ్చుకున్న కత్తితో గిరిధర్ కంఠంపై, భుజంపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో గిరిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేవలం కొన్ని రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేసి నిందితులను అరెస్టు చేయడమే కాకుండా, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకల దుస్తులు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక పెన్‌డ్రైవ్ మరియు మృతుడికి చెందిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సవాలుగా తీసుకుని త్వరితగతిన ఛేదించిన ఇన్‌చార్జ్ కేవీఎస్ సత్యనారాయణ మరియు ఇతర క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
[ Kakinada murder case, Gandi Giridhar case, obscene videos blackmail, Kakinada crime news, AP police arrest, CM Chandrababu, Nara lokesh, Home minister anitha ]


