TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాకినాడలో షాకింగ్ ఘటన.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం..!

Published on: Tue Sep 1, 2026 4:11PM

 

బలవంతంగా మతమార్పిడి చేశాడు.. భర్తపై భార్య సంచలన ఫిర్యాదు..!

కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ టి. నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటన మరువకముందే.. మరో మహిళ తన భర్తపై సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. తనను బలవంతంగా మతం మార్చడమే కాకుండా, వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ జగన్నాథపురానికి చెందిన ఉమల్‌ ఖైర్‌ అలియాస్‌ బాలరమ్య కాకినాడ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌తో కలిసి సోమవారం ఎస్పీ బిందుమాధవ్‌ను కలిసిన బాలరమ్య.. తన భర్త గౌస్‌ మొహిద్దీన్‌ నుంచి రక్షణ కల్పించాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇష్టం లేకున్నా మతం మార్చారని ఆరోపణ..!

తాను జగన్నాథపురంలో డిగ్రీ చదువుతున్న సమయంలో గౌస్‌ మొహిద్దీన్‌తో పరిచయం ఏర్పడిందని బాలరమ్య తెలిపారు. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా సుమారు ఎనిమిదేళ్ల క్రితం అతడిని వివాహం చేసుకున్నానని చెప్పారు. పెళ్లైన రెండు నెలలకే వేధింపులు ప్రారంభమయ్యాయని.. తనను బలవంతంగా మతం మార్చి, షేక్‌ ఉమల్‌ ఖైర్‌గా పేరు మార్చారని ఆరోపించారు. కుమార్తె జన్మించిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయని బాలరమ్య వాపోయారు. ఈ విషయాన్ని స్థానిక పెద్దల దృష్టికి తీసుకెళ్లినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.

మరో ఐదారుగురు మహిళలతో సహజీవనం చేశాడని ఆరోపణ..!

తన కళ్ల ముందే గౌస్‌ మొహిద్దీన్‌ మరో ఐదారుగురు హిందూ మహిళలతో సహజీవనం చేశాడని బాలరమ్య ఆరోపించారు. దీనిపై ప్రశ్నించినందుకు తనను తీవ్రంగా కొట్టేవాడని చెప్పారు. ఒకసారి అతని నుంచి తప్పించుకుని వెళ్లినా.. వెతుక్కుంటూ వచ్చి కత్తులతో బెదిరించాడని ఆరోపించారు.అతనికి భయపడి దూరంగా ఉంటున్న తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి, తన రెండో కుమార్తెను కూడా వేధిస్తానని బెదిరించాడని బాలరమ్య తెలిపారు.

గతంలో తనతో సన్నిహితంగా ఉన్న ఓ యువతిని కత్తితో గాయపర్చిన కేసులో అతడిని 20 రోజుల పాటు రిమాండ్‌కు పంపారని, రౌడీషీట్‌ కూడా తెరిచారని ఆమె పేర్కొన్నారు. ఇటీవల మరో ఎస్సీ యువతిని వేధించిన కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడని తెలిపారు. దీంతో ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని బాలరమ్య వెల్లడించారు.

 హిందూ మతంలోకి తిరిగి వచ్చానని ప్రకటన..!

ఎస్పీ కార్యాలయం ఎదుట తన తల్లితో నుదుటిపై బొట్టు పెట్టించుకున్న బాలరమ్య.. తాను తిరిగి హిందూ మతంలోకి వచ్చినట్లు ప్రకటించారు. కాగా, తన ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టాలని బీజేపీ నేత చిలుకూరి రామ్‌కుమార్‌ కోరారు. బలవంతపు మతమార్పిడులకు సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.


Kakinada, Kakinada News, Andhra Pradesh News, Forced Conversion, Religious Conversion, Alleged Forced Conversion, Woman Complaint, Husband Complaint, Domestic Harassment, Marital Harassment, Kakinada SP Office, Kakinada Police, Andhra Pradesh Police, Telugu news, Telugu One