TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివాహేతర సంబంధం.. జిమ్ ట్రైనర్ దారుణ హత్య..!

Published on: Thu Aug 27, 2026 1:05PM

 

స్నేహితుడి ప్రియురాలితో ఎఫైర్.. హతమార్చిన ఫ్రెండ్..!

కాకినాడలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ జిమ్ ట్రైనర్ హత్యకు గురయ్యాడు. స్నేహితుడి ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో స్నేహితుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాకినాడ రామకృష్ణారావుపేటలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న కొడమాటి సతీష్‌రెడ్డి (30) బుధవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. సతీష్‌రెడ్డికి ఏడాది క్రితమే వివాహం కాగా.. ఆయన భార్య జయశ్రీ ప్రస్తుతం గర్భిణిగా ఉంది.

సతీష్‌రెడ్డి తన స్నేహితుడైన సాయికిరణ్ ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో సాయికిరణ్, అతని భార్య మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సాయికిరణ్‌కు జయశ్రీ కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది.

దీంతో సతీష్‌రెడ్డి, సాయికిరణ్ మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో సాయికిరణ్ తన స్నేహితులతో కలిసి సతీష్‌రెడ్డితో మరోసారి గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు.

గొడవలో సతీష్‌రెడ్డి తలపై చెక్క ముక్కతో బలంగా కొట్టారు. చెక్క ముక్క విరిగిపోవడంతో.. దాని పదునైన భాగంతో సతీష్‌రెడ్డి మెడపై పొడిచినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన సతీష్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న సాయికిరణ్‌తో పాటు పరారీలో ఉన్న అతని స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Kakinada, Gym Trainer Murder, Satish Reddy Murder, Extramarital Affair, Sai Kiran, Ramakrishna Rao Peta, Kakinada Crime, Murder Case, Andhra Pradesh Crime, Crime News, Friendship Dispute, Police Investigation, Telugu news, Telugu one