వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్: ఎందుకు.. ఎక్కడ.?
Published on: Thu Oct 22, 2026 3:59PM

కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కడపలో వైసీపీ కార్యాలయం సమీపంలో పోలీసులు ఆయనను గురువారం (అక్టోబర్ 22) అదుపులోనికి తీసుకున్నారు. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో.. కడప ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. స్థానిక ఎన్నికల నామినేషన్ల వేళ.. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ఆయనను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి అల్లర్ల నేపథ్యంలో కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాజకీయ సమావేశాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అంతకుముందు, మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అవినాష్ రెడ్డిని పులివెందులలో గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే.
[Kadapa MP YS Avinash Reddy Arrest, Kadapa politics, YCP, TDP, Local body Elections,Law And Order, Telugu One]


