TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇన్సులిన్, రెసిస్టెన్స్‌ను తగ్గించే శక్తి జొన్న పిండి సొంతం.. పూర్తి ఆరోగ్య రహస్యాలు!

Published on: Wed Oct 14, 2026 10:34AM

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా 18 నుండి 20 ఏళ్లు దాటిన యువతలో మరియు పెద్దలలో కనిపించే డయాబెటిస్‌కు ప్రధాన కారణం  ఇన్సులిన్ రెసిస్టెన్స్  అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన శరీకంలోని ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసినప్పటికీ, కణాలు దానికి స్పందించకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా టైప్ 2 డయాబెటిస్ అంటారు. ఈ సమస్యను సమర్థవంతంగా అణచివేయడంలో మన సాంప్రదాయ ఆహారమైన పచ్చ జొన్న రొట్టెలు లేదా జొన్న పిండి అద్భుతంగా పనిచేస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. జొన్నల్లో ఉండే ప్రత్యేక పోషకాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మరియు మూడు నెలల సగటు హెచ్‌బీఏ1సీ (HbA1c) ని క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనికి ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ కార్బోహైడ్రేట్లు రక్తంలోకి వేగంగా చేరి చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతాయి, కానీ జొన్నల్లోని కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా రక్తంలో కరుగుతాయి.

రెండవది, ఇందులో ఉండే అద్భుతమైన ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, గ్లూకోజ్ రక్తంలోకి శోષించబడే వేగాన్ని గణనీయంగా మందగింపజేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ అదుపులో ఉంటాయి మరియు హఠాత్తుగా షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉండదు. ఇక మూడవది, ప్రతి 100 గ్రాముల జొన్న పిండిలో దాదాపు 330 కేలరీలు, 10 గ్రాముల ప్రొటీన్, 6 గ్రాముల వరకు పీచు పదార్థం (ఫైబర్) లభిస్తాయి. అంతేకాకుండా గోధుమలతో పోలిస్తే జొన్నల్లో ఐదు రెట్లు అధికంగా, సుమారు 13.8 మి.గ్రా ల ఇనుము (Iron) మరియు 25 మి.గ్రా ల కాల్షియం లభిస్తాయి. ఇది శరీరంలో రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. గోధుమలలో గ్లూటెన్ ఉండటం వల్ల చాలామందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి, కానీ జొన్నలు పూర్తిగా గ్లూటెన్ రహిత ధాన్యం కావడంతో సులభంగా అరిగిపోతాయి. పచ్చ జొన్న పిండితో రొట్టెలు చేయడం కూడా చాలా సులభం. కొద్దిగా నీటిని మరిగించి, ఆ వేడి నీటిలో పిండిని వేసి ఉడికించి, చల్లారాక ఒత్తుకుని రొట్టెలు చేసుకుంటే ఎంతో మృదువుగా వస్తాయి. రోజూ ఆహారంలో జొన్నలను భాగం చేసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

 

 

Jowar flour for diabetes, sorghum flour benefits, jowar flour blood sugar control, low glycemic index foods, diabetes diet tips, jowar roti benefits, millet benefits for diabetes.