TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ తరఫున జ్ణానేశ్వర్ కుమార్ రాయబారాలు.. సీఈసీపై కేరళ మాజీ సీఎస్ ఆరోపణలు.!

Published on: Sun Sep 27, 2026 10:36AM

సీఈసీ జ్ణానేష్ కుమార్‌పై కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి జిజి థామ్సన్ చేసిన ఆరోపణలు  కలకలం రేపుతున్నాయి. తాను సర్వీస్‌లో ఉన్న సమయంలోజ్ణానేష్ కుమార్‌ బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారని, అంతేకాకుండా కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కుతుందని ప్రతిపాదించారని జిజి థామసన్ తాజాగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో  హాట్ టాపిక్ గా మారాయి.

 2016లో ఢిల్లీకి వెళ్లే విమాన ప్రయాణ సమయంలో ఈ ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 

 మైనారిటీ వర్గానికి చెందిన తానకు మంచి వక్తగా పేరుండటం వల్ల బీజేపీ తరఫున బరిలోకి దిగితే సులభంగా విజయం సాధించవచ్చనిజ్ణానేష్ కుమార్‌ చెప్పారనీ,  ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్‌కు వెళితే కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి  దక్కే అవకాశం ఉందని తనను ఒప్పించే ప్రయత్నం చేశారని ధామ్సన్ పేర్కొన్నారు. అయితే, తనకు ప్రత్యక్ష రాజకీయాలపై   ఆసక్తి లేదని విస్పష్టంగా చెప్పి ఆ ప్రతిపాదనను   తిరస్కరించినట్లు వివరించారు.

ప్రస్తుతం దేశంలో ఎన్నికల సంఘం పనితీరు, సీఈసీ జ్ణానేశ్ కుమార్ వ్యవహారశైలి,  నిష్పాక్షికతపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంగా థామ్సన్ వెల్లడించిన విషయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  సీఈసీ గతంలో రాజకీయ పార్టీల కోసం   రాయబారాలు లేదా సిఫార్సులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.  

ధామ్సన్ వెల్లడించిన వివరాలపై  కాంగ్రెస్‌ సహా  ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు జ్ణానేష్ కుమార్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజ్యాంగబద్ధమైన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థకు అధిపతిగా ఉండాల్సిన వ్యక్తి, గతంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంో సీఈసీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  


[Jiji Thomson, Gyanesh Kumar, Chief Election Commissioner, BJP ticket offer, Kerala Former Chief Secretary, Telugu One]