TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మరణించిన తర్వాత కూడా ఆరుగురికి ప్రాణం పోశాడు: అవయవదానంతో చిరంజీవి అయ్యాడు.!

Published on: Sun Sep 27, 2026 8:30AM

మరణించినా ఇతరుల జీవితాలలో వెలుగులు నింపి కీర్తి శేషుడయ్యాడు ఆ యువకులు.    రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ 18 ఏళ్ల యువకుడి అవయవ దానం మరో ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.  .

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 18 సంవత్సరాల సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థి.  సెప్టెంబర్ 17న   కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే  అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఒక   ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఐసీయూలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గురువారం (సెప్టెంబర్ 24)న వైద్యులు అతడు బ్రెయిడ్ డెడ్ అయినట్లు ధృవీకరించారు.  అంతటి విషాదంలోనూ..  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి తల్లిదండ్రులు కుమారుడు మరణించినా జీవించే ఉండాలన్న సదాశయంతో అవయవదానానికి ముందుకు వచ్చారు.  తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీవన్‌దాన్ కార్యక్రమం  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి  శ్రీనాథ్ తండ్రి  సిద్దని పోలయ్య  తమ కుమారుడి అవయవాలను దానం చేయడానికి కన్సెంట్ ఇచ్చారు. 

దీంతో వైద్యులు వైద్యులు   శ్రీనాథ్   మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియా  సేకరించారు. ఈ అవయవాలను అత్యవసరంగా అవసరమైన ఆరుగురు వేర్వేరు రోగులకు విజయవంతంగా అమర్చారు.

 శ్రీనాథ్  అవయవ దానంతో చావు అంచున ఉన్న ఆరుగురికి  పునర్జన్మ లభించింది. శ్రీనాథ్ కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ అధికారులు   కృతజ్ఞతలు తెలియజేశారు. తన అవయవదానంతో  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ మరణించిన తరువాత కూడా చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు.కుమారుడి అవయవదానానిని ముందుకు వచ్చిన సాయి శ్రీనాథ్ కుటుంబం చూపిన ఈ చొరవ రాబోయే రోజుల్లో మరిన్ని కుటుంబాలకు ఆదర్శంగా మారుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. 

[Jeevandan Telangana, Organ Donation Hyderabad, Brain Dead Student organs donaTion, Sai Srinadh, AP Student Organs Save Six Lives]