TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆప్ఘన్ సిరీస్ కు బుమ్రా ఔట్.. ఫిట్ నెస్ లోపమే కారణమా?

Published on: Sat Sep 5, 2026 10:24AM

టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలో ఆప్ఘనిస్థాన్ తో జరగనున్న మూడు మ్యాచ్ ల టి20 సీరీస్ నుంచి ఔట్ అయిపోయాడా? అంటే క్రికెట్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. టీమ్ ఇండియా ఏస్ పేసర్, యార్కర్ల రారాజుగా ప్రపంచ క్రికెట్ లో గుర్తింపు పొందిన జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై మళ్లీ ఉత్కంఠ పెరిగింది. ఆప్ఘనిస్థాన్ తో టి20 సిరీస్ కు బుమ్రాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఆయన ఆ సిరీస్ లో ఆడటం అనుమనమేనని తెలుస్తోంది. బుమ్రా వంద శాతం ఫిట్ నెస్ సాధిస్తేనే ఆప్ఘన్ సిరీస్ లో అతడు ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. 

గత కొంత కాలంగా బుమ్రా ఫిట్ నెస్ ప్రశ్నార్థకంగానే ఉంది. పలు కీలక మ్యాచ్ లకు బుమ్రా ఫిట్ నెస్ లోపం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్థాన్ తో ఈ నెల  13 నుంచి   ప్రారంభం కానున్న మూడు టి20లఈ సిరీస్ కోసం  ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో బుమ్రాకు చోటు దక్కినప్పటికీ,  బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  లో నిర్వహించే మ్యాచ్ సిమ్యులేషన్,  ఫిట్‌నెస్ టెస్ట్‌లో నెగ్గితేనే బుమ్రా తుది జట్టులోకి వస్తాడని బీసీసీఐ వర్గాల సమాచారం.

 శుక్రవారం (సెప్టెంబర్  4) నుంచి సెప్టెంబర్ 9 వరకు జరగనున్న ఈ ప్రత్యేక మ్యాచ్ ప్రాక్టీస్‌లో బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 9న జరిగే  అథ్లెటిక్,  మ్యాచ్ ఫిట్‌నెస్ పరీక్షలో బుమ్రాను టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలించనుంది.   ఒకవేళ అఫ్గానిస్తాన్ సిరీస్‌కు కనుక బుమ్రా అందుబాటులో లేకపోతే, అతని స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను రీప్లేస్‌మెంట్‌గా సిద్ధంగా ఉంచినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.  

[Jasprit Bumrah Unfit For Afghan Series India vs Afghanistan, Bumrah fitness test, BCCI, Team India squad, cricket news]