నాలోని క్రికెటర్ బాధ పడలేక మూడు సార్లు వెళ్లిపోదామనుకున్నాను 

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్  ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా లెవల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారుతుంది. దీంతో శ్రీదేవి అభిమానుల ఆనందం మాములుగా లేదు. తన తల్లి లాగా ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జాన్వీ  ఒక మూవీ  నుంచి తప్పుకోవాలని అనుకుందనే వార్త చూసి  అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. అసలు విషయం ఏంటో చూద్దాం

 జాన్వీ అప్ కమింగ్ మూవీ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి. ప్రముఖ హీరో  రాజ్ కుమార్ రావు తో  కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. మే 31 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ మూవీలో  జాన్వీ ప్రొఫిషనల్  క్రికెటర్ గా   మెరవబోతుంది. క్యారక్టర్ పర్ఫెక్షన్ కోసం రెండు  సంవత్సరాల నుంచి క్రికెట్ లో  శిక్షణ తీసుకుంటుంది. పైగా తనని  పూర్తి స్థాయి  క్రికెటర్‌గా మార్చడానికి కోచ్ లు కూడా చాలా కష్టపడ్డారు. ఇక షూటింగ్  టైం లో అయితే చెప్పక్కర్లేదు. జాన్వీ కి ఎన్నో సార్లు  గాయాలయ్యాయి. ఒక దశలో తన  రెండు భుజాలు  పని చెయ్యలేదు. ఆ సమయంలో  ఎన్నోసార్లు  సినిమా నుంచి వైదొలగాలని అనుకుంది. కానీ  చిత్ర యూనిట్ ఆమెకి  ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు. ఈ విషయాలన్నీ  జాన్వీ కపూర్ నే  చెప్పింది. ప్రస్తుతం ఆ  మాటలు వైరల్ గా మారాయి 

చాలా మంది  జాన్వికి సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్ ని పొగుడుతున్నారు. ప్రస్తుతం  తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర లో చేస్తుంది.అక్టోబర్ లో ఆ మూవీ విడుదల కానుంది. అలాగే రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు మూవీ లోను హీరోయిన్ గా చేస్తుంది. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. రాబోయే రోజులన్నీ జాన్వీ వే