జగనన్న జైలులో, నో న్యూ ఇయర్ వేడుకలు

 

jagan jail, jagan ysrcongress, ysr congress new year celebrations, jagan bail

 

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉండటంతో ఈ సారి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోరాదని ఆ పార్టీ అధినాయకత్వం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా నిర్భంధం లో ఉంచారని వారన్నారు.

 

జగన్ ను ఏడు నెలలుగా అక్రమంగా నిర్భందంలో ఉంచారని, ఆ కారణం వల్ల ఈ సారి ఆ వేడుకలను జరుపుకోరాదనేది పార్టీ సీనియర్ నాయకుల నిర్ణయమని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. జగన్ కు బెయిల్ వస్తుందని తమ పార్టీ కార్యకర్తలంతా ఇటీవల ఎదురుచూసారని, అయితే, అది రాకపోవడంతో వారంతా నిరుత్సాహం చెందారని ఆయన అన్నారు. ఈ వేడుకలకు దూరంగా ఉండి, జగన్ ను జైలులో ఉంచడానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియచేయాలని పార్టీ భావించిందని ఆయన అన్నారు.



అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీలు రెండూ కలిసి ఈ కుట్ర పన్నాయని, దీనిని ఎదుర్కొనేందుకు రేపు ప్రారంభం కానున్న ‘జగన్ కోసం జనం సంతకాలు’ ఉద్యమాన్ని ఉదృతంగా చేపట్టాలని ఆ నాయకులు కోరారు.

జగన్ తన బెయిల్ కోసం ఎనిమిది సార్లు కోర్టుల్లో పిటీషన్లు వేస్తే, వాటిని దర్యాప్తు సంస్థ సిబిఐ కుట్ర పూరితంగా అడ్డుకొదని వారు ఈ సందర్భంగా అన్నారు.

ఆ పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఈ సారి నూతన సంవత్సర సందర్భంగా మిఠాయిలు పంచడం, కేక్ లు కట్ చేయడం, దండలు స్వీకరించడం వంటివి చేయవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు.