వామ్మో.. జనం భూమిపై జగన్ భారీ కుట్ర!

ఒక తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీకి ఊడిపోయే ముఖ్యమంత్రి లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన కామెంట్లు విని జనానికి మతిపోతోంది. కడుపులో ఇంత కుట్ర పెట్టుకుని, జనం భూమిని కబళించడానికి ఇన్ని ప్లాన్స్ వేస్తూ, పైకి మాత్రం జనానికి మేలు చేయడానికి మాత్రమే దేశంలో ఎక్కడా లేని ఈ చట్టాన్ని తెస్తున్నట్టుగా జగన్ మాట్లాడుతున్న తీరు చూసి ‘ముదురు టెంకెవే’ అని అని జనం అనుకుంటున్నారు. 

ఎవరైనా సరే ఫలానా భూమి తమది అని ప్రభుత్వం దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ వేరే ఎవరైనా ఆ భూమి తమదని ప్రభుత్వానికి క్లైమ్ చేసుకుంటే, ఆ విషయాన్ని సదరు అసలు ఓనరు గుర్తించి, నిర్ణీత వ్యవధిలో ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. లేకపోతే ఎవరైతే ముందు ఆ భూమి తమదని క్లెయిమ్ చేశారో వారికే ఆ భూమి చెందుతుంది. ఆ తర్వాత భూమి రియల్ ఓనర్ కోర్టుకు వెళ్ళే ఛాన్స్ కూడా వుండదు. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటే, ప్రభుత్వమే జరిగిన పొరపాటును గ్రహిస్తుంది. నష్టపోయిన వ్యక్తికి ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుంది. అంతే తప్ప, అక్రమంగా భూమిని కొట్టేసిన వ్యక్తిని ఏమీ అనదు.

ఇక్కడ పెద్ద తిరకాసు ఏమిటంటే, ఏ భూమి అయినా గవర్నమెంట్ విలువ ఎకరానికి రెండు లక్షలు వుంటే, దాని విలువ మార్కెట్లో ఎన్ని కోట్లయినా వుండవచ్చు. ప్రభుత్వ ధరకు, అసలు ధరకు చాలా వ్యత్యాసం వుంటుంది. అంటే, జగన్ మనుషులే భూములు కబ్జా పెడతారు. భూమి సొంతదారు లబోదిబోమంటే, గవర్నమెంట్ పరిహారం ఇస్తుంది. అంటే, లక్షలు, కోట్ల విలువ చేసే భూమికి ప్రభుత్వ రేటు ఎంత వుందో అంత ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. భూమి విలువ ఎంత వుందో అంతే ఇచ్చాంగా.. ఇందులో మా తప్పేముంది అని అమాయకంగా మాట్లాడుతుంది. నీ భూమిని నువ్వు కాపాడుకోకుండా నిర్లక్ష్యం వహించావు, అందుకే అది అన్యాక్రాంతం అయింది. అయినా సరే, ప్రభుత్వం దయతలచి నీకు నష్టపరిహారం ఇచ్చింది అని దానకర్ణుడికి కజిన్ సిస్టర్లా మాట్లాడుతుంది. అప్పుడు భూమి యజమానికి ఏడవటం తప్ప చేసేదేం వుండదు.