జోగి రమేష్ పై జగన్ ఆగ్రహం.!
Published on: Wed Aug 26, 2026 11:11AM

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ కుటుంబ వివాదం ఇప్పుడు ఆయనకు వైసీపీలో ఉన్న పలుకుబడిని పలుచన చేసింది. వ్యక్తిగత కుటుంబ సమస్యల్లో చిక్కుకుని, వాటికి రాజకీయ రంగు పులమడం ఏమిటని జగన్ జోగి రమేష్ పై ఒకింత అసహనం, ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. జోగి రమేష్ కుటుంబంలో తలెత్తిన ఘర్షణలు, వివాదాలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటి నుంచి బయటపడడానికి పార్టీ ప్రతిష్టను ఫణంగా పెట్టి జోగి రమేష్ రాజకీయం చేస్తున్నారనీ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తన కుటుంబ కలహాలను రాజకీయ వేదికలపైకి తీసుకురావడం, తమ ఇంట్లో రేగిన రచ్చకు తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా కారణమంటూ.. జోగి రమేష్చేసిన విమర్శల పట్ల జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సీనియర్ నాయకుడై ఉండి కూడా ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించి పార్టీ ప్రతిష్ఠను మసకబార్చారని జగన్ ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. వెంటనే ఈ వివాదానికి తెరదించాలని, రాజకీయంగా ప్రకటనలు చేస్తూ పార్టీకి నష్టం చేయవద్దనీ ఇప్పటికే జగన్ నుంచి జోగి రమేష్‌కు స్పష్టమైన హెచ్చరికలు వెళ్లినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Jagan angry on Jogi Ramesh, YS Jagan, Jogi family dispute, AP Politics, Jogi Ramesh daughter in law, TeluguOne


