TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ సెంచరీ: క్రికెట్ లో కాదండోయ్.. యలహంకా టు తాడేపల్లి పర్యటనల్లో.!

Published on: Wed Nov 25, 2026 3:49PM

క్రికెట్ లో సెంచరీ కొట్టడం ఓ మైలు రాయి. క్రికెటర్ తన కెరీర్ లో ఎన్ని సెంచరీలు కొట్టాడు. ఎంత వేగంగా కొట్టాడు? ఇత్యాది విషయాలపై క్రీడాభిమానులకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు సెంచరీ కొట్టడం అనే మాట అసలు వినిపించనే వినిపించదు. ఎందుకంటే వారు ఎన్నికలలో వంద సార్లు గెలవడమన్నది జీవిత కాలంలో సాధ్యమయ్యే పని కాదు. అయితే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం పర్యటనల్లో సెంచరీ కొట్టేశారు. అదేదో రాష్ట్రంలో ప్రజా సమస్యల కోసం చేసిన వరుస పర్యటనలో కాదు. కేవలం బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేసిన పర్యటనల్లో ఆయన సెంచరీ కొట్టేశారు. 

అది కూడా 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత, ఆయన తన మకాంను ఏపీ నుంచి బెంగళూరుకు మార్చేశారు. అక్కడే ఉంటూ వారానికి ఓ సారి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిపోయే క్రమంలో ఆయన బెంగళూరు యహలంక ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ మధ్య చేసిన పర్యటనలు వంద దాటేశాయి. ఆ విధంగా రెండేళ్ల వ్యవధిలోనే బెంగళూరు టు తాడేపల్లి షటిల్ సర్వీసెస్ లో ఆయన సెంచరీ కొట్టేశారన్న మాట.   

[Jagan, Century, Tours, Yalahanka, Tadepally, TeluguOne]