TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాకెట్ల తయారీకి ఇస్రో చెల్లు చీటీ.. ఎందుకంటే?

Published on: Sat Aug 22, 2026 12:13PM

ఇస్రో ఇప్పటివరకు నౌకలు, రాకెట్ల తయారీ, ఉపగ్రహాల ఉత్పత్తి వంటి బాధ్యతలను స్వయంగా నిర్వహించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఇస్రో, ఇకపై ఆయా దశలవారీగా తప్పుకుంటోంది. అందులో భాగంగా తొలుత రాకెట్ల నిర్మాణం,  ప్రయోగ వాహనాల వాణిజ్య ఉత్పత్తి  బాధ్యతల నుంచి వైదొలగ నుంచి వైదొలగి.. ఆ బాధ్యతలను   ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. 

 బిజినెస్ టుడే నిర్వహించిన  ఇండియా @ 100 ఎకానమీ సమ్మిట్ కార్యక్రమంలో    ఇన్-స్పేస్  ఛైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకా ఈ విషయాన్ని వెల్లడించారు.  భవిష్యత్తులో ఇస్రో స్వయంగా ఎలాంటి లాంచ్ వెహికల్స్‌ను తయారు చేయదని, వాణిజ్యపరమైన రాకెట్ల తయారీని ప్రైవేట్ పరిశ్రమలే నిర్వహిస్తాయని ఈ సమ్మిట్ వేదికగా ఆయన అధికారికంగా ప్రకటించారు.  చిన్న ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లే ఎస్ఎస్ఎల్వీ  సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య ఉత్పత్తి హక్కులను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో  ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్  పీఎస్ఎల్వీ, ఎల్వీఎమ్3) సాంకేతికతను కూడా ప్రైవేట్ రంగానికి బదిలీ చేసేందుకు  వేగంగా అడుగులు వేస్తున్నది. అయితే ఈ సారి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, అర్హత కలిగిన ప్రైవేట్ కంపెనీలకు కూడా ఈ ఉత్పత్తుల కాంట్రాక్టుల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది.

భారత అంతరిక్ష రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రయోగ వాహనాల తయారీ భారాన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించడం ద్వారా ఇస్రో పూర్తిస్థాయి పరిశోధన అభివృద్ధి  సంస్థగా పనిచేయడానికి మార్గం సుగమమవుతుందంటున్నారు. ఇకపై ఇస్రో శాస్త్రవేత్తలు అధునాతన సాంకేతికత, ఖగోళ పరిశోధనలు,  అంతరిక్ష మిషన్లు, భవిష్యత్ అవసరాలకు సరిపడే వినూత్న శాటిలైట్ల రూపకల్పనపైనే  దృష్టి సారిస్తారు 

ISRO Givesup Rocket Manufacturing,  Private Sector, Pawan Goenka, PSLV LVM3 Private Production, India Space Reforms, Small Satellite Launch Vehicle HAL