TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫ్లై దుబాయ్ ఘటనలో రియల్ హీరో : స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం.!

Published on: Fri Oct 9, 2026 2:41PM

ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ ఫ్లై దుబాయ్ విమానంలో ప్రయాణీకులను రక్షించిన ఇండియన్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ కు ఇజ్రాయెల్ సర్కార్ అరుదైన గౌరవాన్ని ప్రకటించింది.  విమాన కాక్‌పిట్‌లో సహ పైలట్‌ దాడిని ఎదుర్కొని, తీవ్రంగా గాయపడి కూడా ప్రయాణీకులను రక్షించడమే లక్ష్యంగా సాహసోపేతంగా పోరాడిన స్మిత్ మచ్చర్ ను  ప్రధాని మోడీ సహా పలు దేశాధినేతలు నిజమైన హీరోగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఆ హీరోకు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు  ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధ్యక్షుడు  ఐజాక్ హెర్జాగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మచ్చార్ కోలుకున్న తర్వాత స్వయంగా పురస్కారం అందజేస్తామన్నారు.  

సెప్టెంబర్ 30, 2026న దుబాయ్ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానం  కాక్‌పిట్‌లో సహ పైలట్‌ దాడి చేయడంతో కెప్టెన్ స్మిత్ మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు సహా మొత్తం 182 మంది ఉన్నారు.  కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా వెనక్కు తగ్గని మచ్చార్.. కాక్‌పిట్‌ తలుపును తెరవగలిగారు.

దీంతో విమానంలోని కొందరు ప్రయాణికులు లోపలికి చేరుకుని దాడికి పాల్పడిన సహ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్లు కూడా పరిస్థితిని నియంత్రించడంలో సహకరించారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. 

జెరూసలెంలో జరిగిన కార్యక్రమంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ విమానంలోని ప్రయాణికుల్లో ఆరుగురిని పౌర శౌర్య పురస్కారంతో సత్కరించారు. ప్రమాద సమయంలో స్పందించి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు సహకరించినందుకు వారికి ఈ గుర్తింపు లభించింది. అదే సందర్భంగా కెప్టెన్ మచ్చార్ ధైర్యం, వృత్తిపరమైన నిబద్ధత వల్ల పెను ప్రమాదం తప్పిందని హెర్జాగ్ ప్రశంసించారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత ఇజ్రాయెల్ ప్రజల తరఫున పురస్కారాన్ని అందజేస్తానని ప్రకటించారు.

ఘటన అనంతరం మచ్చార్‌కు తొలుత సౌదీ అరేబియాలో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆయనను అబుధాబికి తరలించారు.  ప్రస్తుతం స్మిత్ మచ్చార్ చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నారు.  మచ్చార్ చూపిన ధైర్యసాహసాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రశంసించారు. వి త్యవసర పరిస్థితుల్లో మచ్చార్ వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. 

 [Israeli Gallantry Waward Smith Machar, Indian pilot, Flydubai flight, Isaac Herzog, Passenger Safety, Telugu One]