ఫ్లై దుబాయ్ ఫ్లైట్ కూల్చివేతకు సిద్ధమైన ఇజ్రాయెల్: అది సౌదీలో ల్యాండ్ కావడంతో తప్పిన ముప్పు.!
Published on: Tue Oct 6, 2026 2:47PM
.webp)
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్ వివాదం రేపిన సంచలనం తెలిసిందే. కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసమాన ధైర్య సాహసాలు, సమయస్ఫూర్తి, ప్రాణాలు పోతున్నా, విమానాన్ని, అందులోని ప్రయాణీకులను రక్షించాలన్న సంకల్పం కారణంగా విమానం సురక్షితంగా సౌదీలో ల్యాండ్ అయ్యింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చర్ ఆ తరువాత ఆస్పత్రిలో కోలుకున్నారు. ప్రపంచం మొత్తం ఆయనను హీరోగా అభివర్ణిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
అదలా ఉంటే.. ఆ విమానం రూట్ మార్చుకుని సౌదీలో ల్యాండ్ కాకుండా టెల్ అవీవ్ వైపే వచ్చి ఉంటే, ఇజ్రాయెల్ దళాలు ఆ విమానాన్ని కూల్చి వేసి ఉండేవారు. ఔను నిజం ఆ విమానం టెల్ అవీవ్ కు చేరుకోవడానికి ముందే దానిని గాలిలోనే కూల్చివేయడానికి ఇజ్రాయెల్ రక్షణ యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. విమానంలో సిబ్బంది, ప్రయాణీకులు ఉన్నారనీ, కూల్చివేస్తే వారంతా మరణిస్తారనీ తెలసి కూడా, ఆ ప్రయాణీకుల కంటే, జాతీయ భద్రతే ముఖ్యమని భావించిన ఇజ్రాయెల్ ఆ విమానం కూల్చివేతకు నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా అధికారిక నివేదికల ద్వారా తేటతెల్లమైంది,
విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్‌లో జరిగిన అనూహ్య ఘర్షణ ఇరు దేశాల అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో విమానం అకస్మాత్తుగా వేలాది అడుగులు కిందకి దూసుకుపోవడం, సిబ్బంది నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఇజ్రాయెల్ భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇది హైజాక్ యత్నం కావచ్చని లేదా దేశంపై ఉగ్ర దాడి కావచ్చని అధికారులు అనుమానించారు.

ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అత్యవసర కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, వెంటనే తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. అంతే కాకుండా, అనుమానిత విమానాన్ని అడ్డగించేందుకు రక్షణ దళాలు యుద్ధ విమానాలను రంగంలోకి దించాయి. విమానంపై నియంత్రణ కోల్పోయినట్లు లేదా ఉద్దేశపూర్వకంగా ప్రమాదానికి గురిచేసేలా వ్యవహరిస్తున్నట్లు సంకేతాలు అందడంతో, ప్రోటోకాల్ ప్రకారం గాల్లోనే దానిని కూల్చివేయడానికి సైన్యం సిద్ధమైంది. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాల కంటే దేశ భద్రతకే ప్రాధాన్యతనివ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఇజ్రాయెల్ పేర్కొంది.
అయితే.. చివరి నిమిషంలో విమానం తన దిశను మార్చుకుని సౌదీ అరేబియా వైపు మళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం సౌదీ వైపు వెళ్తున్నట్లు, అక్కడ అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు స్పష్టత పొందిన తర్వాతే ఇజ్రాయెల్ తన ఫైటర్ జెట్లను వెనక్కి పిలిపించుకుంది. ఈ ఘటనకు సంబంధించి సౌదీ అరేబియా కూడా స్పందించి తమ దేశ గగనతలంలో అప్రమత్తత ప్రకటించినట్లు సమాచారం.
[Israel Tel Aviv Flydubai plane Incident, Israel Decided Shoot Down, Tel Aviv Flight Emergency, Cockpit Attack, Israel Defense Jets, Telugu One]


