కాగ్నిజెంట్ ఫ్రాడ్ నిజమేనా?.. అసలు జరిగిందేంటి?
Published on: Sat Sep 12, 2026 2:42PM

ఒకప్పుడు ప్రపంచం ఒక గ్లోబాల్ విలేజ్ ఐపోయిందని జనం చెప్పుకుంటూ ఉండేవారు. ఈనానుడి రావటానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొదటిది అంతర్జాలం. ఇంటర్నెట్ పుణ్యమా అని సమాచారం ఎక్కడి నుండి ఎక్కడికైనా మెరుపు వేగంతో చేరుతోంది. ఒకప్పుడు అంటే ఆరు దశాబ్దాల కిందట మన దేశంలోని చాలా ఊళ్ళుకు రోజూ ఉదయమే వార్తాపత్రిక వచ్చే సదుపాయమే లేదు. ఇంటింటికీ కాదుకదా వాడ కొక రేడియో ఐనా అబ్బురమే. ఊళ్ళకు ఊళ్ళే ఒక్క టెలిఫోనూ లేనివి ఉండేవి. అత్యవసరంగా టెలిగ్రాం అని వార్త పంపినా మరునాటికే చేరే ఊళ్ళూ బోలెడు.
ఇప్పుడు అచ్ఛుపత్రికల అవసరమే తరిగిపోయింది. మనిషిమనిషికీ అరచేతి వైకుంఠంలా మొబైల్ ఉంది. అందులో ప్రతిక్షణం తాజా వార్తలు ప్రత్యక్షం. ప్రపంచంలో ఎవరితోనైనా ఉచితంగా మాట్లాడే సౌకర్యం ఉంది. అప్పట్లో దేశంలోనే వేరే ప్రాంతాలను దూరం అనుకొనే మానసిక పరిస్థితి. నేడు పిల్లలు దేశదేశాలూ తిరిగి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడియోకాల్ లేని రోజులు పోయి రోజూ పెద్దలు విదేశాల్లోని పిల్లలతో వీడియోకాల్స్ చేసి మాట్లాడుతున్నారు. ఈసమాచార విప్లవం ప్రపంచాన్ని గ్లోబాల్ విలేజీని చేసిన మొదటి కారణం.
ఇక రెండో కారణం కూడా బలమైనదే ముఖ్యమైనదే. రెండవ ప్రపంచ యుధ్ధం తరువాత కొన్ని దశాబ్దాల పాటు అమెరికా రష్యాల మధ్య వేడివేడిగా జరిగిన కోల్డ్ వార్ వలన వివిధదేశాల మధ్యన ప్రజలు స్వేఛ్ఛగా తిగగలిగే వాతావరణం ఉండేదికాదు. కాని సోవియట్ రష్యా పతనం తరువాత పరిస్థితి అనూహ్యంగా మారింది. అన్నిదేశాలూ విదేశీయులకు తలుపులు తెరిచేసాయి. దేశదేశాల కరెన్సీలకూ అమెరికన్ డాలర్లు కామన్ ఎక్చేంజ్ కావటంతో ఆర్ధిక ప్రయోజనం కనిపించి అన్ని దేశాల పౌరులూ అమెరికా బాటపట్టారు సంపాదనకోసం. అక్కడే చదివి అక్కడే ఉద్యోగం చేయడం విద్యార్ధులకు కలగా మారిపోయింది.
ఈ పరిస్థితికి అమెరికన్ సమాజమూ ఒక కారణమే. దశాబ్దాలుగా తమ ఆయుధాలను భారీ రలకు విదేశాలకు అంటగడుతూ అమెరికా మరింత సంపన్న దేశంగా మారుతూ ఉండటం.. ఆఫాల్స్ మనీతో అమెరికాలో ఉద్యోగస్థుల జీతాలు భారీగా పెరిగాయి.
మారిన అంతర్జాతీయ పరిస్థితులూ, సమాచార విప్లవమూ అమెరికన్ కంపెనీలకు ఒక కొత్త అవకాశం కల్పించింది. వారు తమ ఉత్పత్తుల నుండి లాభాల శాతం పెంచుకుందుకు గాను అమఖ్యమైన ఉద్యోగాలను ఇతరదేశాలకు తరలించటం మొదలుపెట్టారు. పనిలో పనిగా అమెరికన్ ఉద్యోగులకు బదులు వలసవచ్చిన విదేశీయులకు తమ కంపెనీలలో ఉద్యోగాలను తక్కువ జీతాలకు ఇవ్వటం మొదలుపెట్టారు. ఆరంభంలో ఈ కార్యకలాపాల జోరు కారణంగా ప్రపంచం పూర్తిగా గ్లోబాల్ విలేజ్ ఐపోయింది.
దీని వల్ల అమెరికన్ ప్రజలకూ తమ ఉత్పత్తులు కాస్త చవక ధరలకు దొరకసాగాయి. అమెరికన్ కంపెనీలకూ లాభాలు ఇబ్బడిముబ్బడి అయ్యాయి. అమెరికన్ ఉత్పత్తులు మంచి గ్లోబాల్ మార్కెట్ సాధించాయి. అందరూ హేపీ. ముఖ్యంగా మన విద్యార్ధులు. వాళ్ళకు అమెరికా చదువూ అమెరికా ఉద్యోగం అమెరికన్ డాలర్లపంట. ఇంకేం కావాలి?
మన దేశవాళీ కంపెనీలూ కొత్త లాభసాటి వ్యాపారం కనిపెట్టాయి. అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే కంపెనీలు వెలిసాయి. అమెరికాలో తమ ఉద్యోగులకు కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పించి వాళ్ళిచ్చే సొమ్ములో సింహభాగం తామే బొక్కేసి మ నదేశవాళీ కంపెనీలు వ్యాపారమోసం చేసినా అలా ఐనా చేతికి దొరికే జీతమే బోలెడంత అని మనవాళ్ళూ అమెరికాకు పరుగెత్తటం జోరయ్యింది.
ఈ వ్యవహారంలో మన దేశానికి చెందిన ఛోటా కంపెనీలే కాదు మంచి పేరున్న కంపెనీలూ ఉన్నాయి. వందలూ వేలూ జనాన్ని అమెరికాలో ఉద్యోగాల్లో పెట్టి బాగా వ్యాపారం చేస్తున్నాయి. కాలక్రమేణా అమెరికన్ పౌరసమాజం అసలు విషయం గ్రహించింది. కొన్ని ఉత్పత్తుల ధర తగ్గటం అటుంచి తమ పౌరుల ఉద్యోగాలను విదేశీ కంపెనీలు లూటీ చేస్తున్నాయని గ్రహించింది. దీంతో అమెరికాలో ఆందోళనలు మొదలయ్యాయి. . ఇందులో సత్యం లేకపోలేదు.
అమెరికా ఒక విధానంగా విదేశీయుల్లోని మేధావులకే తమ దేశంలో ఉద్యోగ వసతి కల్పించి లాభపడాలని యోచించించి. కాని ఆచరణలో అర్హులైన తమ పౌరుల ఉద్యోగాలను విదేశీయులు కాజేయటం కనబడుతోంది. దానితో మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి అనే జాతీయవాద ఉద్యమ్యం మొదలైంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ వారు ఈఉద్యమానికి రాజకీయంగాబలమైన మద్దతుదారులు. అందుచేత విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వటంపై కఠిన నిబంధనలను విధించటం ద్వారానూ విదేశీ విద్యార్ధులను పరిమితం చేయటం ద్వారాను వారు అమెరికన్ పౌరులకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని చూస్తున్నారు. దానని తప్పుపట్టలేం కానీ, విదేశీ విద్యార్ధులపై విదేశీ ఉద్యోగులపై వారు మానసిక హింసకూ భౌతిక దాడులకూ పాల్పడుతూ పరిస్థితిని భీతావహంగా మార్చటం ఇసుమంతైనా సమర్థనీయం కాదు. లాభార్జన కోసం అనైతిక విధానాల ద్వారానూ మోసపూరితచర్యల ద్వారానూ వీసాలను సంపాదిస్తున్నారనీ, తమ ఉద్యోగులకు శాశ్వత నివాసపత్రాలకు దరఖాస్తు చేస్తున్నారనీ కొన్ని కంపెనీలపై అమెరికన్ ప్రభుత్వం కొరడా విసురుతోంది. ఆ కొరడా దెబ్బ తాజాగా కాగ్నిజెంట్ కంపెనీకి తగిలింది. మరోకంపెనీకీ తగిలింది. సరే. కాగ్నిజెంట్ ఏ పాపం చేసందనిఆ దెబ్బతగిలింది?
కాగ్నిజెంట్ కంపెనీ 1994లో చెన్నైలో పుట్టి అమెరికాలో స్థిరపడింది. పేరుకు పూర్తిగా అమెరికన్ కంపెనీయే కాని నిజానికి వారికి గల వేలాది మంది ఉద్యోగులలో అత్యధిక శాతం మంది చెన్నై, పుణే, బెంగుళూరు, హైదరాబాదు వంటి ఇండియన్ సిటీలకు చెందిన వారే. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం 21 బిలియన్ డాలర్ల చిల్లర.
ఇప్పటిదాకా అమెరికన్ ఉద్యోగ వీసాలూ శాశ్వని వాసపత్రాలు (గ్రీన్ కార్డు) వంటివి కేవలం మానవ వనరుల వ్వవహారం కిందే భావించబడుతూ వస్తోంది. క్రమంగా ఆ భావన స్థానంలో విదేశీయుల రాకడా నివాసమూ అమెరికన్ జాతీయ భద్రతా వ్యవహారంగా లెక్కించటం మొదలైంది. అందువలన ఈ విషయాలపై అభ్యర్ధనలు సాధారణ పరిశీలనతో బయటపడటానికి లోతైన విచారణలకు గురికావటం తప్పనిసరి అవుతున్నది.
ఇలా ఉద్యోగ వీసాలు, గ్రీన్ కార్డు అభ్యర్ధనలను పంపే వ్యక్తుల గురించీ, కంపెనీల గురించీ ప్రతి చిన్న విషయాన్ని అమెరికా భూతదద్దం పెట్టి శోధించడం మొదలెట్టంది.
ఇబ్బడి ముబ్బడిగా అభ్యర్ధనలు పంపే కంపెనీలు నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నాయా? ఉద్దేశపూర్వకంగానే అమెరికన్ అభ్యర్ధులను ప్రక్కన బెట్టి విదేశీయులను ముందుకు తోస్తున్నారా? అంతా సజావుగానే ఉందని చూపటానికి అక్రమమార్గాలు తొక్కతున్నారా? అమెరికన్ ప్రభుత్వ వ్వస్థలను ఏవిధంగానైనా మోసగిస్తున్నారా? ఇటువంటివన్నీ క్షుణ్ణంగా పరిశోధిస్తున్నారు. అసలు ఈ కంపెనీల బిజినెస్ మోడళ్ళు నిజంగా ఎలా నడుస్తున్నాయా అని ఆరాలు. తీస్తున్నారు.
తమాషా ఏమిటంటే 15వందల మంది అమెరికన్ కాలేజీ కుర్రాళ్ళను ఉద్యోగులుగా త్వరలో నియమిస్తున్నాం అని కాగ్నిజెంట్ ప్రకటించిన మరునాడే కొరడా మీద పడింది. అంటే ఆప్రకటన కేవలం ఒక డ్రామా అని ప్రభుత్వం భావించిందనే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
అమెరికాలో పనిచేసే కంపెనీలు తమ ఆదాయ స్థాయికి అనుగుణంగానూ తమ వృత్తిరంగం పరిస్థితికి అనుగుణంగానూ ఉద్యోగకల్పన చేయాలి. అలా చేసే ఉద్యోగ కల్పనలో అమెరికన్ పౌరులకు పెద్దపీట వేయాలి. స్థానికంగా అమెరికన్ పౌరులెవరూ దొరకని సందర్భాలలో మాత్రమే విదేశీయులకు అవకాశం ఇవ్వాలి. ఏవైనా మతలబులు చేసి అమెరికన్ పౌరులను తొక్కవేసి విదేశీయులనే ముఖ్యంగా తెస్తూ ఉంటే అది శిక్షార్హ నేరమే. ఏవేవో గోల్ మాల్ వ్యవహారాలను కొన్ని కంపెనీలు నడిపిస్తూ ఉంటే వాటిని పసిగట్టి ప్రభుత్వ వ్వవస్థలను హెచ్చరించే వారూ ఉంటారక్కడ. అట్టి నిఘాను హర్షణీయం కాదన లేము.
అందువలన కాగ్నిజెంట్ పైన హెచ్-1బి వీసాలు, గ్రీన కార్డ్ కోసం ఫైలింగులకూ నిషేధం విధించింది అగ్రరాజ్యం. ఇదే నిషేధం క్లౌడ్-ఎరా కంపెనీపైనా విధించింది.ఆస్ట్రేలియాలో కూడా ఇటువంటి వాతావరణమే పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో భారతవిద్యార్ధుల వీసాల తిరస్కరణ బాగా పెరిగింది. అక్కడా భారతీయులు తమ ఉద్యోగాలను దురాక్రమణ చేస్తున్నారన్న భావన బాగా పెరిగింది.
గ్లోబాల్ విలేజ్ అని ప్రపంచాన్ని అనటం ఇక కష్టం. ప్రపంచంలో అనేక దేశాలలో వలసదారులు ఉద్యోగావకాశాలను ఇతోధికంగా పొందటం అక్కడి ప్రజలకు ఆమోదయోగ్యం కావటు లేదు. దానికి తోడు కొన్ని కంపెనీలు ముసుగు వ్యాపారాల ద్వారా స్థానికుల అవకాశాలకు గండికొడుతూ ఉండటం తీవ్రమౌతోంది.
మనదేశంలో వ్యాపారం చేసే కంపెనీ ఏదైనా ముప్పాతిక మువ్వీసం ఉద్యోగాలను తమ దేశపు అభ్యర్థులతో నింపుతూ ఉంటే మన దేశపు పౌరులూ చట్టసభలూ ఆ కంపెనీని కట్టడి చేసే చర్యల గురించి మాట్లాడటం జర గదా? మన ప్రభుత్వాలు కార్యరంగంలోనికి దిగి కఠినచర్యలకు దిగవా? ఇప్పుడు అమెరికా తీసుకుంటున్న చర్యలూ అవేనని అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.
[Is Cognizant Fraud real, What actually happened, Cognizant PERM suspension, US Visa fraud probe, Cloudera labour certification, Green card applications US,Telugu One]


