TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్రో.. ఐ డోంట్ కేర్: బాలయ్య సినిమా క్లిప్పింగ్ తో అమెరికాకు ఇరాన్ రిటార్డ్.!

Published on: Thu Sep 24, 2026 7:48AM

ఇరాన్ పై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. ఆ దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీయడం, లొంగ దీసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.    ఇరాన్ వైమానాలను ఎగరనీయమని హెచ్చరించింది. ఆ దేశ విమాన సంస్థలకు ఫ్యుయెల్ పోయవద్దని ప్రపంచ దేశాలకు హుకుం జారీ చేసింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్   తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఇరాన్ దేశాన్ని  ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ చెప్పు చేతల్లో ఉండాలనీ,  లేకుంటే ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని హుంకరించారు. సరే అగ్రరాజ్యాధినేత హెచ్చరికలు, దాడులను ఇరాన్ ఇసుమంతైనా లేక్క చేయడం లేదు అది వేరే సంగతి. అగ్రరాజ్యానికి దీటుగా ఇరాన్ కూడా దాడులు చేసింది. 

ఇదంతా పక్కన పెడితే.. ఇరాన్ ను నామరూపాలు లేకుండా చేస్తామంటూ అగ్రరాజ్యాధినేత ట్రంప్ చేసిన హెచ్చరకకు ఇరాన్ ఓ వీడియోతో దిమ్మతిరిగే రిటార్డ్ ఇచ్చింది. బ్రో ఐడోంట్ కేర్ అంటూ.. నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్ ఉన్న వీడియోతో ఇరాన్ ఇచ్చిన రిటార్డ్ సంచలనంగా మారింది. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేశరి సినిమాలోని ఓ హై యాక్షన్ సీన్ వీడియోతో అమెరికాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.  

ఇరాన్ బలహీన  దేశం కాదు. ఆ విషయం అగ్రరాజ్యాధినేతకు కూడా తెలుసు అని పేర్కొంది. ఆయన కేవలం హాలీవుడ్ సినిమాలే కాకుండా ఇండియన్ మూవీలు కూడా చూస్తే బాగుంటుందని సెటైర్లు గుప్పించింది. అయితే ఇరాన్ భగవంత్ కేశరి హిందీ డబ్బింగ్ వీడియోను తన పోస్టుకు షేర్ చేసిందనుకోండి అది వేరే సంగతి.

కానీ అగ్రరాజ్యాధినేత హెచ్చరికకు దీటుగా ఇరాన్ బాలకృష్ణ మూవీలోని క్లిప్పింగ్ ను ఉపయోగించుకోవడంతో  బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.  మొత్తానికి బాలయ్య మూవీలోని పవర్ ఫుల్ సీన్ ను ఉటంకిస్తూ ఇరాన్ అమెరికాను షేక్ చేసేలాంటి రిటార్డ్ ఇచ్చిందని అంటున్నారు. 


[Iran Retords US, Balayya Movie Clip, Bhagavant Kesari, Cinema, Tunnel, Scene, Telugu One]