TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హర్మూజ్ జలసంధిలో నిషేధిత జోన్.. ఇరాన్ ప్రకటన.!

Published on: Mon Sep 7, 2026 8:58AM

అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జల సంధి విషయంలో  ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధింలో నిషేధిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ఇరాన్, ఆ నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించిన ఏ నౌకనూ వదలబోమని హెచ్చరించింది.  

ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి  మొహ్సెన్ రెజాయీ   టీవీ ఇంటర్వ్యూలో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.  రాబోయే కొద్ది రోజుల్లో   ఈ జోన్‌ను అధికారికంగా ప్రకటిస్తామన్న ఆయన, అమెరికా నేవీ ఏర్పాటు చేసిన బ్లాకేడ్ లైన్ నుంచి ప్రారంభమై, హర్మూజ్ జలసంధి మీదుగా పర్షియన్ గల్ఫ్‌లోకి ఈ జోన్ విస్తరించి ఉందన్నారు.  ఈ ప్రాంతంలోకి వచ్చే నౌకలను ఇరాన్ ఆంక్షల జాబితాలో చేరుస్తామనీ, ఇది వాటి ఇన్సూరెన్స్, భవిష్యత్ ప్రయాణాలపై ప్రభావం చూపుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. 

అగ్రరాజ్యాధినేత  డొనాల్డ్ ట్రంప్  హర్మూజ్ ఓపెన్ అని చెప్పడం పూర్తి అవాస్తవమని కుండబద్దలు కొట్టిన  మొహ్సెన్ రెజాయీ    గతంలో రోజుకు 100కు పైగా నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో, ఇప్పుడు ఏడెనిమిది నౌకలే వెడుతున్నాయని వివరించారు. ఈ ఏడెనిమిది నౌకలూ కూడా ఇరాన్ అవసరాలకు సంబంధించినవేనన్నారు. ఇరాన్ తాజా  ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోంది. హర్మూజ్ సలసంధిలో నిషేధిత జోన్‌కు సంబంధించిన   మ్యాప్‌లు,  వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 


[Iran Announce Exclusion Zone In Harmux, warns ships, Strait of Hormuz,  Mohsen Rezaee, US Iran tensions, Telugu One]