Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐకూ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
posted on: Mar 13, 2026 5:02PM

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్ ఐకూ దేశీయ మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే వచ్చిన ఐకూ Z11కు కొనసాగింపుగా iQOO Z11x 5Gను లాంచ్ చేసింది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, భారీ 7,200mAh బ్యాటరీ, 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇక ధర, ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి.
ఫోన్ ఫీచర్లు
iQOO Z11x 5G ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6తో పనిచేస్తుంది. ఇందులో 6.76 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ కలిగి ఉంది. ఫోన్‌కు IP68, IP69 రేటింగ్‌లు కూడా ఉన్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ బొకే కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ బరువు సుమారు 219 గ్రాములు.
ధర, ఆఫర్లు
iQOO Z11x 5G మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
6GB + 128GB వేరియంట్ ధర: రూ.18,999
8GB + 128GB వేరియంట్ ధర: రూ.20,999
8GB + 256GB వేరియంట్ ధర: రూ.22,999
యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్ వినియోగదారులకు రూ.2,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. ఈ ఫోన్‌కు రెండేళ్ల ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 16 నుంచి అమెజాన్‌లో విక్రయాలకు అందుబాటులోకి రానుంది. ప్రిస్మాటిక్ గ్రీన్, టైటాన్ బ్లూ రంగుల్లో ఇది లభ్యం.






