ఏఐపై సడలిన ఇన్వెస్టర్ల నమ్మకం: కుప్పకూలిన మార్కెట్లు.. టెక్ దిగ్గజ కంపెనీల షేర్లు పతనం.!
Published on: Fri Oct 30, 2026 9:48AM

అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత, భారీ వ్యయాలకు సంబంధించి పెట్టుబడిదారులలో నెలకొన్న ఆందోళనల కారణంగా వాల్ స్ట్రీట్ కుదేలైంది. దిగ్గజ టెక్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. నాస్‌డాక్ ఇండెక్స్ ఊహకు అందని రీతిలో పతనమైంది.
గత ట్రేడింగ్ సెషన్లలో టెక్ దిగ్గజాల పనితీరుఇన్వెస్టర్లను పునరాలోచనలో పడేసింది. టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ (గూగుల్) షేర్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. త్రైమాసికం చివరి నాటికి కంపెనీ నమోదు చేసిన ప్రతికూల ఫ్రీ క్యాష్ ఫ్లో మార్కెట్లను కుదిపూసింది. దీంతో ఒక్క రోజులోనే ఆల్ఫాబెట్ వందలాది బిలియన్ డాలర్లు కొల్పోయింది.

ఆ తరువాత వెలువడిన అమెజాన్, ఇంటెల్ వంటి దిగ్గజ కంపెనీల ఫలితాలు కూడా నిరాశా జనకంగా ఉండటం మార్కెట్ ను మరింత దెబ్బతీసింది. ఆన్‌లైన్ వ్యాపార వృద్ధి మందగించడం వల్ల అమెజాన్ షేర్లు పడిపోగా, పీసీ ప్రాసెసర్ల కొరత, సప్లై చైన్ సమస్యల కారణంగా ఇంటెల్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇక సాఫ్ట్‌వేర్ సేవలందించే సర్వీస్‌నౌ సంస్థ, ఇతర సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.
ఇందుకు ప్రధాన కారణం ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు లాభాలు అందిస్తాయన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో తగ్గిపోవడమే కారణంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాల ప్రభావం అగ్రరాజ్యంపై మాత్రమే కాకుండా ఆసియా మార్కెట్లపై కూడా పడింది. గ్లోబల్ ఏఐ డిమాండ్‌కు ఇండెక్స్ గా భావించే చిప్ తయారీ సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి. తైవాన్, జపాన్ వంటి ప్రముఖ ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఈక్విటీ ఫ్యూచర్లలో నాస్‌డాక్, ఎస్ అండ్ పి 500 సూచీలు క్షీణించాయి.
[Investors Lost Confidence, US Stock Market Losses, AI Spending Concerns, Wall Street Tech Stocks, Alphabet Amazon Share Crash, Telugu One]


