TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిఠాపురం జనసేనలో అసమ్మతి: రచ్చకెక్కి దాడులకు దిగిన జనసైనికులు.!

Published on: Mon Nov 23, 2026 3:50PM

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో జనసేన పార్టీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వేళ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న అసమ్మతి ఉద్రిక్తతకు, దాడులకు దారితీసింది. 

పార్టీ ప్రకటించిన అభ్యర్థిని వ్యతిరేకిస్తూ కొందరు నేతలు, కౌన్సిలర్లు నిరసనలకు దిగడంతో పాటు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పీఏపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. 

పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా, కూటమి తరఫున పాతిక మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో జనసేనకు 18 మంది సభ్యుల బలం ఉంది. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికి జనసేన తరఫున కౌన్సిలర్ బొజ్జ వెంకటేశ్వరరావు పేరును పార్టీ ప్రకటించింది. 

అయితే ఈ ఎంపికపై పార్టీలోని కౌన్సిలర్లు విభేదించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వెంకటేశ్వరరావుకు కాకుండా, మొదటి నుంచి జనసేనలో పనిచేస్తున్న సంధ్యకు వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:  కూటమిలో పిఠాపురం రచ్చ.. చంద్రబాబు గరం.. పవన్ కల్యాణ్ మౌనం!​

ఈ వివాదం, అసమ్మతి, అసంతృప్తి చినికిచినికి గాలివానగా మారింది.  ఈ వివాదం తీవ్రరూపం దాల్చి జనసేన నేతలు, కౌన్సిలర్లు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పీఏ చక్రిపై దాడికి పాల్పడే వరకూ వెళ్లింది.

చివరకు అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. పిఠాపురంలో జనసేనలో ఏర్పడిన ఈ వర్గ పోరు, ఆందోళనల పరిణామాలపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయినట్లు సమాచారం. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు

మీకు నచ్చవచ్చు:  డంపింగ్ యార్డుకు కొత్త రూపం.. పిఠాపురంలో పీఠికాపుర వనం..!

సర్జరీ తరువాత తొలిసారిగా పవన్ పిఠాపురం పర్యటన.!

[Internaldispute, Pithapuram Jana Sena,  Municipal Vice Chairman, assault, MP, TeluguOne]