నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈవో గల్లంతు.!
Published on: Sat Aug 29, 2026 9:40AM

నేపాల్ లో జల ప్రళయం సృష్టించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇండియన్ దిగ్గజ ఐసీ సంస్థ ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) గల్లంతయ్యారు. ఇన్ఫోసిస్ ప్రధాన సేవల్లో కీలక విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈవో లాక్స్ గోపిసెట్టి నేపాల్ వరద ఉధృతిలో గల్లంతయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం నెపాల్ వెళ్లిన ఆయన ఆచూకీ లభించడం లేదు. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ అధికారికంగా వెల్లడించింది. లాక్స్ గోపిశెట్టి గల్లంతుపై ఇన్ఫోసిస్ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుతం తమ ప్రధాన లక్ష్యం మరియు మొదటి ప్రాధాన్యత లాక్స్ గోపిసెట్టి క్షేమ సమాచారాన్ని, ఆయన భద్రతను నిర్ధారించడమేనని ఆ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్లిష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఇన్ఫోసిస్ అండగా ఉంటుందని పేర్కొంది. నేపాల్ ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేక రెస్క్యూ బృందాలు లాక్స్ గోపిశెట్టి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లుఇన్ఫోసిస్ పేర్కొంది.
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో హఠాత్తుగా విరుచుకుపడిన ఈ జలప్రళయం సృష్టించిన నష్టం ఊహకందని రీతిలో ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రాథమిక వివరాల ప్రకారం, ఈ ప్రకృతి విపత్తులో కనీసం 320 మంది ఇండియన్లు గల్లంతయ్యారు. వీరంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.
కాగా, గల్లంతైన లాక్స్ గోపిసెట్టి గ్లోబల్ కార్పొరేట్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న టెక్ నిపుణుడు. ఇన్ఫోసిస్ ప్రొఫైల్ ప్రకారం లాక్స్ గోపిశెట్టి.. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు ఐటీ వ్యూహాలు, ఆధునిక డిజిటల్ సాంకేతికత అమలు, సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తుంటారు. ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన ఇన్ఫోసిస్‌లోనే గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా, డిజిటల్ వర్క్‌స్పేస్ సర్వీసెస్ విభాగ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో కంపెనీ విస్తరణలో కీలక భూమిక పోషించారు.
ఇన్ఫోసిస్‌లో చేరడానికి ముందు ఆయన క్సెంచర్ లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. అలాగే.. ఐబీఎం, హెచ్‌సీఎల్ , పీడబ్ల్యూసీ వంటి బహుళజాతి సంస్థలలోనూ ఉన్నత స్థాయి యాజమాన్య బాధ్యతలను నిర్వహించారు.
{Infosys CEP Missing in Nepal Floods, Lax Gopisetty, Infosys Public Services CEO, Nepal Floods Missing Indians, MEA Rescue Operation}


