TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండిగో చార్జీల బాదుడు.!

Published on: Fri Sep 18, 2026 8:46AM

భారత విమానయాన రంగంలో ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో చార్జీల బాదుడుతో షాకిచ్చింది. దేశీయ విమాన సర్వీసుల్లో పలు కీలకమైన అదనపు (అన్సలరీ) సేవలకు సంబంధించిన ఛార్జీలను ఇండిగో భారీగా పెంచింది. సాధారణ విమాన టికెట్ ధరలతో పాటు ప్రయాణంలో అవసరమయ్యే అదనపు సౌకర్యాల కోసం ఇకపై అదనపు మొత్తం చెల్లించక తప్పని పరిస్థితి ప్రయాణీకులకు ఏర్పడింది. పసిపిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు, లగేజీ  ఉన్నవారికీ ఈ తాజా పెంపు పెద్ద భారంగా మారనుంది. 

విమాన ప్రయాణాల వ్యయం పెరుగుతుండటంతో మధ్యతరగతి ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ఇండిగో  తాజా ధరల సవరణలో భాగంగా, విమానంలో ప్రయాణించే పసిపిల్లల  ఛార్జీలను 2 వేల నుంచి 3 వేల రూపాయలకు పెంచింది.  మూడు రోజుల నుండి రెండేళ్ల వయసున్న శిశువులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రయాణ సమయంలో పసిపిల్లలు తల్లిదండ్రుల ఒడిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక లగేజీ విషయంలోనూ ప్రయాణికులపై భారం పడింది.

నిర్ణీత పరిమితికి మించి అదనపు లగేజీని తీసుకెళ్లే ప్రయాణికులకు కేజీకి 7 వందల రూపాయలుగా ఉన్న చార్జీని 8వందల రూపాయలకు పెంచింది.  అలాగే..  విమాన ప్రయాణంలో ఒంటరిగా ప్రయాణించే చిన్నారుల  సర్వీస్ ఫీజును 5 వేల నుంచి 5 వేల 999 రూపాయలకు పెంచింది.  ఇక  ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు తక్షణ సౌకర్యం కల్పించే ప్రయారిటీ చెక్-ఇన్,  ప్రయారిటీ బోర్డింగ్ సేవలను   450 నుండి   650 రూపాయలకూ, .  అలాగే విమాన ప్రయాణ ధృవీకరణ పత్రం ఫీజును కూడా  200 నుండి  300 రూపాయలకు పెంచింది ఈ పెంపుదల అన్నీ తక్షణమే అమల్లోకి వచ్చింది. 

[Indigo Flight Charges, Domestic Air Travel, Infant Travel Fee, Excess Baggage Rates, Priority Boarding, Telugu One]