TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శంషాబాద్‌లో ఇండిగో విమానానికి బర్డ్ హిట్.. ముందు భాగంలో సొట్ట.!

Published on: Sun Oct 4, 2026 2:52PM

ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం వ్యక్తం కావడంతో కలకలం రేగింది. పూణే నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో 6E352 విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే సమయంలో పక్షి ఢీకొట్టినట్లు పైలట్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. 

నిపుణులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. విమానం ముందు భాగంలో సొట్ట పడినట్లు గుర్తించారు. దీంతో విమానాన్ని వెంటనే సాంకేతిక పరిశీలనకు పంపించారు. అయితే అదృష్టవశాత్తూ విమానం ఎలాంటి ప్రమాదం లేకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. అదే విమానం శంషాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లాల్సి ఉంది. 


కానీ బర్డ్ హిట్ అనుమానం నేపథ్యంలో గుర్తించిన సాంకేతిక సమస్యల కారణంగా ఆ సర్వీసును నిలిపివేశారు. విమానాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క క్షణం ఆలస్యం జరిగినా పరిస్థితి ఎలా ఉండేదోనన్న ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

 

[ IndiGo flight, Bird hit,Shamshabad Airport, Pune to Hyderabad flight, Emergency landing, Indigo flight 6E352, Telugu One, Telugu News ]