TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జింబాబ్వేతో మూడు టి20ల సిరీస్: క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా విమెన్స్ టీమ్.!

Published on: Wed Oct 21, 2026 8:04AM

జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు   క్లీన్‌స్వీప్ చేసింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్  స్టేడియం వేదికగా మంగళవారం (అక్టోబర్ 20)  జరిగిన  మూడో టీ20లో టీమ్  92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో సొంతం చేసుకుంది. 

టాస్ గెట్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడి కే 37 బంతుల్లోనే 69 పరుగులు చేసింది.    మరోవైపు   హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా పరుగుల వరద పారించింది.   41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వీరిద్దరితో పాటు అనుష్క శర్మ 28 పరుగులు చేయడంతో టీమ్ ఇండియా జింబాబ్వేకు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది.  

217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో  జింబాబ్వే జట్టు చేతులెత్తేసింది. టీమ్ ఇండియా  బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. జింబావ్వే బ్యాటర్లలో   షార్నే మేయర్స్ 60, బెలోవ్డ్ బిజా 44 పరుగులు చేసి రాణించినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు విఫలం అయ్యారు.   భారత బౌలర్లలో నందనీ శర్మ  3 వికెట్లు,  నికీ ప్రసాద్, క్రాంతి గౌడ్, అరుంధతీ రెడ్డి మరియు దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టడంతో జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

[Indian Womens Cricket Team Clean sweep Zimbabwe, India VS Zimbabwe T20, Harmanpreet Kaur, Shafali Verma, Half Centuries, Telugu One]