180 ప్రాణాలను కాపాడిన హీరో పైలట్: ఫ్లైదుబాయ్ విమానంలో అసలు ఏం జరిగింది.. ?
Published on: Thu Oct 1, 2026 9:47AM

అంతర్జాతీయ విమానయాన చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా కో పైలట్ విమానాన్ని హైజాక్ చేయడానికి లేదా కూల్చి వేయడానికి చేసిన ప్రయత్నాన్ని అత్యంత సాహసోపేతంగా అడ్డుకున్న పైలట్ ఉదంతమింది. దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఫ్లైట్ ఎఫ్ జడ్ 1073 లో ఈ ఘటన జరిగింది. ఫ్లైట్ గాలిలో ఉండగా, కాక్ పిట్ లో ఓమానీ జాతీయత కలిగిన కో-పైలట్ ఫ్లైట్ ను హైజాక్ చేయడానికి లేదా కూల్చివేయడానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగా కత్తిలో పైలెట్ కెప్టెన్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రాణాలను ఫణంగా పెట్టి ఆ దాడిని ఎదుర్కొంటూనే.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
13ఏళ్లః పైగాఅనుభవం, నైపుణ్యం ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్చర్.. క్లిష్ట సమయంలో అనితర సాధ్యమైన సంయమనం ప్రదర్శించి.. కో పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడి స్ఫృహ కోల్పోయే పరిస్థితిలో కూడా కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ కాక్‌పిట్ తలుపులు తెరుచుకునేలా చేసి ప్రయాణికులకు, సిబ్బందికి సమాచారం అందించారు. ఆయన చూపిన సమయస్ఫూర్తి, తెగువ వల్ల ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు, ఆఫ్-డ్యూటీ పైలట్లు వెంటనే అప్రమత్తమై ముందుకు వచ్చి దుండగుడిని దాడికి పాల్పడిన కో పైలట్ ను అదుపు చేసి, విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. సౌదీ అరేబియా అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన అనితర సాధ్యమైన తెగువ, సమయస్ఫూర్తిని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల అగ్రనేతలు ప్రశంసల్లో ముంచెత్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్మిత్ మచ్చర్ ను రియల్ హీరోగా అభివర్ణించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్చార్ చూపిన ధైర్యం వందల మంది ప్రాణాలను కాపాడిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. అచంచలమైన సంకల్పాన్ని అభినందించిన మోడీ.. ఇండియా మొత్తం స్మిత్ మచ్చర్ ను చూసి గర్విస్తోందని పేర్కొన్నారు.
[Indian Pilot, Flydubai Flight, Smit Machchhar, Cockpit Attack, Tabuk Emergency Landing, Modi, Trump. Netanyahu, Praise, Telugu One]


