TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికా వర్సిటీకి రూ.189 కోట్ల విరాళమిచ్చిన ఇండియన్ దంపతులు.!

Published on: Wed Sep 9, 2026 2:28PM

అమెరికాలో స్థిరపడిన భారత సంతతి దంపతులు వికాస్ సిన్హా, అనురాధ సిన్హా తమ గొప్ప మనసును చాటుకున్నారు. విదేశాల్లో ఉంటూ కూడా భారతదేశం గర్వపడేలా చేసిన ఈ దంపతులు, నార్త్ టెక్సాస్ యూనివర్సిటీకి ఏకంగా 20 మిలియన్ డాలర్లు అంటే   ఇండియన్ కరెన్సీలో దాదాపు 189 కోట్ల రూపాయలను  విరాళంగా అందించారు. విదేశీ గడ్డపై   తెలుగు, భారతీయ సంస్కృతికి,  దాతృత్వానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ ఘటన  ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విరాళం ద్వారా ఆ యూనివర్సిటీ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది.

వీరి ఉదారతకు గుర్తింపుగా, నార్త్ టెక్సాస్ యూనివర్సిటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేయబోయే  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలేజీకి  ది అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా నామకరణం చేయనున్నారు. దీనివల్ల ఇకపై అమెరికాలో అగ్రగామిగా వెలుగొందే ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థపై తెలుగు వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఏఐ ( విద్యను మరింత మందికి చేరువ చేయడంలో ఈ కాలేజీ ప్రముఖ పాత్ర పోషించనుంది.

 విద్య ద్వారానే తమ జీవితాలు   మారాయని, ఆనాడు తమకు అందిన అదృష్టాలు,  అవకాశాల వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.  అందుకే ఉన్నత విద్య అందించే అవకాశాన్ని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ  విరాళం ఇచ్చినట్లు సిన్హా దంపతులు పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఎంతోమంది విద్యార్థులు ఈ ఏఐ కాలేజీ ద్వారా తమ కలలను సాకారం చేసుకుంటారని   ఆశాభావం వ్యక్తం చేశారు. 


[indian Origin Couple Donation, Vikas Sinha Anuradha Sinha , North Texas University, Ai College US, 20 Million Dollars Donation, Telugu Diaspora Success, Telugu One]