TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కెప్టెన్సీకి హర్మన్ ప్రీత్ కౌర్ గుడ్ బై: మహిళా క్రికెట్ దిగ్గజం సంచలన ప్రకటన.!

Published on: Tue Oct 6, 2026 12:23PM

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ లోని అన్ని ఫార్మట్ల కెప్టెన్సీ నుంచీ వైదొలగుతున్నట్లు ప్రకటించింది.  హర్మన్ ప్రీత్ కౌర్ నిర్ణయం దేశవ్యాప్తంగా  క్రీడాభిమానులను షాక్ కు గురి చేసింది.

కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ఆమె చేసిన అనూహ్య ప్రకటనతో క్రికెట్ బోర్డు అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు.  గత కొద్ది కాలంగా జట్టును విజయవంతంగా ముందుండి నడిపించిన ఆమె, వ్యక్తిగత కారణాలు, భవిష్యత్ ప్రణాళికలను ఉటంకిస్తూ కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది.

సుదీర్ఘకాలం పాటు భారత మహిళా జట్టుకు నాయకత్వం వహించిన హర్మన్‌ప్రీత్ కౌర్, తన కెప్టెన్సీలో జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించారు. టీట్వంటీలు, వన్డేలు,  టెస్టులు ఇలా అన్ని ఫార్మట్లలో  జట్టును అగ్రగామిగా నిలపడంలో  స్కిప్పర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ పాత్ర ఏంతో కీలకం అనడంలో సందేహం లేదు.  

అటువంటి హర్మన్ ప్రీత్ కౌర్.. హఠాత్తుగా జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం క్రీడా ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. అయితే  కెప్టెన్సీ భారం నుంచి పూర్తిగా ముక్తి పొంది, కేవలం ఒక సాధారణ  ప్లేయర్ గా జట్టు విజయాల కోసం పూర్తి స్థాయిలో శ్రమించాలని భావిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపింది.  

కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ సింగ్  జట్టులోని యువ ఆటగాళ్లకు   స్పూర్తిగా నిలిచింది.  వరుస అంతర్జాతీయ టోర్నమెంట్ల ఒత్తిడి, ప్రభావం తన బ్యాటింగ్ ప్రదర్శనపై పడుతోందన్న భావనతోనే ఆమె కెప్టెన్సీ నుంచి వైదొలగలన్న నిర్ణయానికి వచ్చినట్లు క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. తన బ్యాటింగ్ ప్రదర్శనపై మరింత ఏకాగ్రత పెట్టాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం ద్వారా తనపై ఉన్న మానసిక భారాన్ని తగ్గించుకుని, రాబోయే మ్యాచులలో మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందని ఆమె అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. 

[India Womens Cricket Captain Harmanpreet Kaur, Team India Captency, Resign, Cricket News, Telugu One]