టీమ్ ఇండియా, విండీస్ టీ20 సిరీస్: బెంగళూరులో డూఆర్ డై మ్యాచ్: వరుణుడు కరుణించేనా.!
Published on: Sat Oct 17, 2026 11:26AM

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి మ్యాన్ బెండగళూరు వేదికగా శనివారం (అక్టోబర్ 17) జరగనుంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ జరిగిన నాలుగు మ్యాచ్ లలో ఇరు జట్లూ చెరో రెండు మ్యాచ్ లూ గెలిచాయి. దీంతో సిరీస్ విన్నర్ ను డిసైడ్ చేసే డూ ఆర్ డై మ్యాచ్ గా ఐదో టీ 20 మారింది.
హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టి20లో లక్ష్య ఛేదనలో తడబడిన టీమ్ ఇండియా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక బెంగళూరు వేదికగా జరగనున్న ఐదో మ్యాచ్ లో బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాలని భావిస్తోంది. టాపార్డర్ రాణిస్తున్నప్పటికీ, మధ్య ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోవడం జట్టును ఇబ్బంది పెడుతోంది. గత మ్యాచ్లో సంజు శాంసన్, తిలక్ వర్మ పోరాడినప్పటికీ విజయం అందని ద్రాక్షగా మారింది. దీంతో ఈసారైనా పకడ్బందీ వ్యూహంతో బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
మరోవైపు వెస్టిండీస్ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. షెఫర్డ్, రూథర్ఫర్డ్ అతడికి కొండంత అండగా నిలుస్తూ.. భారత బౌలింగ్ అటాక్ ను కకావికలు చేస్తున్నారు. భువనేశ్వర్ రాకతో ఈ పరిస్థితి మరే అవకాశం ఉందని టీమ్ మేనేజ్ మెంట్ ఆశాభావంతో ఉంది. పవర్ ప్లే లో వికెట్లు తీసే సత్తా.. డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించే సామర్థ్యం ఉన్న భువనేశ్వర్ కుమార్ విండీస్ బ్యాటర్లకు కళ్లెం వేస్తాడని క్రీడా నిపుణులు కూడా అంటున్నారు.

అది పక్కన పెడితే.. బెంగళూరు మ్యాచ్ కు వరుణ గండం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక క్రికెట్ అభిమానులను కలవర పెడుతోంది. వరుణుడు కరుణించి మ్చాచ్ జరగనివ్వాలని కోరుకుంటున్నారు. హోరాహోరీగా సాగిన ఈ సిరీస్ విజేతను తేల్చే చివరి టి20 మ్యాచ్ సజావుగ జరగాలని కోరుకుంటున్నారు. ఈ ఆఖరి పోరులో టీమ్ ఇండియా విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో టీమ్ ఇండియా ఉంది. మరోవైపు విండీస్ టీమ్ కూడా వన్డే సిరీస్ ఓటమికి టి20 సిరీస్ విజయంతో బదులు తీర్చుకోవాలని భావిస్తోంది.
[India vs West Indies 5th T20 Series Decider, Bengaluru T20 Match, Team India Batting, Bhuvaneswar Kumar Reentry, Rain, Hurdle, Telugu One]


