చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా: కొండంత లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేసింది.!
Published on: Thu Oct 1, 2026 10:02AM
.webp)
వన్డే క్రికెట్ లో టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. టీమ్ ఇండియా తన 55 ఏళ్ల వన్డే హిస్టరీలో ఇప్పటి వరకూ ఎన్నడూ సాధించని ఘనత సాధించింది. వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా గువహటి వేదికగా జరిగిన రెండో వన్డేలో విండీస్ నిర్దేసించిన కొండంత లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి.. విజయకేతం ఎగుర వేసింది.
1971లో మొదలైన వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు ఏకంగా 5,023 మ్యాచ్‌లు జరగ్గా, ఈ 55 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఎప్పుడూ సాధించిని ఘనతను టీమ్ ఇండియా సాధించింది. బ్యాటర్లకు స్వర్గధామంగా ఉన్న గువహటి పిచ్ పై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసి.. టీమ్ ఇండియా ముందు దాదాపు అసాధ్యమనదగ్గ విజయ లక్ష్యాన్ని ఉంచింది.

అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ తగ్గలేదు. టీమ్ ఇండియా ఓపెనర్లు స్కిప్పర్ శుభమన్ గిల్, రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పోటాపోటీగా సిక్సర్లు, ఫోర్లూ బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఆ క్రమంలో రోహిట్ శర్మ సెంచరీ, శుభమన్ గిల్ అజేయ డబుల్ సెంచరీ సాధించారు. 406 పరుగుల విజయలక్ష్యాన్ని టీమ్ ఇండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది రెండో అత్యుత్తమ రన్ ఛేజ్ కావడం విశేషం.
[India vs West Indies, Guwahati ODI, Shubman Gill Double Century, Rohit Sharma Century, ODI Cricket History, Telugu One]


